Ind vs Aus: ఇండియా తొలి మ్యాచ్ రేపే, చెన్నై పిచ్ ఎవరికి అనుకూలం, టాస్ కీలకం కానుందా
Ind vs Aus: ప్రపంచకప్ 2023 ప్రారంభమై మూడ్రోజులైనా టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ రేపు జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. చెన్నై పిచ్ ఎవరికి అనుకూలమనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
Ind vs Aus: ప్రపంచకప్‌కు కొద్దిగా ముందు మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమ్ ఇండియాకు రేపటి ప్రపంచకప్ తొలి మ్యాచ్ అదే ఆస్ట్రేలియాతో కావడం ఉత్సాహం కల్గించే అంశమే అయినా శుభమన్ గిల్ అందుబాటులో లేకపోవడం బాధించనుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జోరుగా సాగుతోంది. ప్రపంచకప్ ప్రారంభమై మూడ్రోజులైనా టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ ఇంకా జరగలేదు. రేపు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ప్రపంచకప్‌కు కొద్దిగా ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ ఇండియా గెల్చుకోవడంతో రోహిత్ సేనలో కాస్త ఉత్సాహం కన్పిస్తోంది. అదే సమయంలో శుభమన్ గిల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం బాధిస్తోంది. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండటం ఇండియాకు శుభ పరిణామంగా ఉంది. ఈ క్రమంలో చెన్నై పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండనుంది. ఎలా ఉంటుందనేది ఆసక్తి కల్గిస్తోంది.
టాస్ కీలకం
చెన్నైలోని చిదంబరం స్డేడియం ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు ఇరువురికీ అనుకూలంగా ఉండే అరుదైన పిచ్. ఈ వికెట్ సాధారణంగా పొడిగా ఉండటంతో స్పిన్నర్లకు కాస్త ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశాలున్నాయి. అందుకే టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే ఛేజింగ్ జట్టుకు పరుగులు సాధించడం ఈ పిచ్‌పై కాస్త కష్టమే.
వర్షం అడ్డంకి లేనట్టే
ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి దాదాపుగా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే రేపు గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్టం 27 డిగ్రీలు ఉండవచ్చు. ఆకాశం మేఘావృతంగా ఉన్నా వర్షాలు పడే అవకాశం చాలా తక్కువ.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్ ( డౌట్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్
ఆస్ట్రేలియా
ప్యాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లీష్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook