స్వల్ప స్కోరుకే కివీస్ కు కళ్లెం వేసిన భారత బౌలర్లు; ఇక గెలుపు బాధ్యత బ్యాట్స్మెన్లదే
వరల్డ్ కప్ సెమీస్: వర్షం కారణంగా నిలివివేసిన ఇండియా - కివీస్ మ్యాచ్ ను ఈ రోజు కొనసాగుతోంది.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న సెమీస్ పోరులో కివీప్ ను భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు నిలువరించగలిగారు. ఆది నుంచే క్రమశిక్షణతో బౌలింగ్ వేస్తూ కివీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేశారు. ఏ మాత్రం నియంత్రణ కోల్పకుండా ప్రతి ఒక్కరూ జగ్రత్తగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ విషయంలోనూ పొరపాట్లు దొర్లకుండా కోహ్లీసేన జాగ్రత్త పడింది.
మ్యాచ్ కు వర్షం అడ్డంకి...
ఇలా మ్యాచ్ కొనసాగుతున్న తరుణంగా సరిగ్గా 47 వ ఓవర్లలో వర్షం కురువడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి గ్రౌండ్ నీటితో ముద్దయింది. దీంతో మంగళవారం మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటికీ కివీస్ 5 వికెట్లు కోల్పోయి 211 (46.1) పరుగులు చేసింది. వర్షం అనంతరం మళ్లీ ఈ రోజు మ్యాచ్ ప్రారంభించిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 239 పరుగలు మాత్రమే చేసింది. ఇలా కివీస్ జోరుకు కళ్లెం వేసి తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు భారత బౌలర్లు.
క్రమశిక్షణతో కూడిన బౌలింగ్
భారత బౌలర్లలో ఒక్క చాహల్ మినహాయిస్తే అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ మూడు వికెట్లు తీయగా..మిగిలిన వారు తలో ఒక వికెట్ తీశారు. క్షమశిక్షణతో కూడిన బౌలింగ్ ఫలితంగా కివీస్ ను టీమిండియా కట్టడి చేయగల్గింది. ఇక మిగిలిన పనిపూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాట్స్ మెన్లపై నే ఉంది. పటిష్ట బాటింగ్ లైనప్ కలిగిన కోహ్లీసేనకు ఇది కష్టతరమైన స్కోర్ కాకపోయినప్పటీ పిచ్ తేమగా ఉండటంతో విజయాన్ని అందుకోవాలంటే జాగ్రత్తగా ఆడాల్సి ఉందని క్రీడా పండితులు హోచ్చరిస్తున్నారు.
మరోసారి ఆదుకున్న విలియమ్స్ ...
కివీస్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే పదునైన భారత బౌలింగ్ ఎదుర్కొంటూనే వికెట్లు పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదిలో గుప్తిల్ (1) రూపంలో తొలి వికెట్ పడినప్పటికీ నికోలాస్ ( 28 ) కెప్టెన్ కేన్ విలియమ్స్ (67) మరో వికెట్ పడకుండా జగ్రత్త తీసుకున్నారు. కొంత సేపు భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించిన నికోలాస్ తన వ్యక్తిగత స్కోర్ 28 పరుగుల వద్ద జడేజా బౌలింగ్ బౌల్డ్ అయి ఔట్ గా వెనుదిగిగాడు. అప్పటికే కివీస్ స్కోర్ 69/2 చేరింది.
కివీస్ కు గౌరవప్రదమైన స్థితికి చేర్చిన రాస్ టేరల్
నికోలాస్ ఔట్ అనంతరం రంగంలోకి దిగిన రాస్ టేరల్ తో కలిసి కెప్టెన్ విలియన్ వికెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నిదానంగా పరుగులు రాబడుతూ వచ్చారు. ఇరువురు కలిసి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. స్కోర్ బోర్డు 134 వద్ద కెప్టెన్ విలయన్స్ ను స్పిన్నర్ చాహల్ పెలివిలియన్ పంపాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ల (జేమ్స్ నీషమ్ 12, ధోమ్ 16, హెన్నీ 10, మిఛెల్ 09)తో కలిసి రాస్ టేరల్ (74) కివీస్ కు గౌరవప్రదమైతన స్కోర్ అందించాడు.