Ricky Ponting Says Australia Afraid of Virat Kohli and Cheteshwar Pujara Form: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2023కి సమయం ఆసన్నమవుతోంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు బృందాలుగా లండన్‌ చేరుకున్నారు. ఐపీఎల్ 2023 ఆడిన మిగతా భారత ప్లేయర్స్ కూడా లండన్ చేరుకున్నారు. మరోవైపు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఇప్పటికే ఆసీస్ సన్నద్ధమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) 2023 నేపథ్యంలో మాజీ క్రికెటర్స్ తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డులు కలిగిన భారత స్టార్స్ విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారాల గురించే ఆసీస్‌ ఆందోళన చెందుతోందన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కోహ్లీ, పుజారా కీలకమవుతారని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. వీరిద్దరి ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. 


ఐసీసీ రివ్యూలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'భారత జట్టులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా అనుభవం ఉన్న ప్లేయర్స్. వీరిద్దరి గురించి ఆస్ట్రేలియా జట్టు ఆందోళనకు గురవుతోంది. కోహ్లీ, పుజారా రికార్డు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. ఆస్ట్రేలియా మీద పుజారా నాణ్యమైన ప్రదర్శన చేశాడు. ఓవల్‌లోనూ ఆస్ట్రేలియా మాదిరి పిచ్‌ పరిస్థితులే ఉంటాయి. కాబట్టి పుజారాకు అక్కడ పరుగులు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరోవైపు కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ బెంగళూరు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇదే ఫామ్ ఫైనల్లో చూపుతాడని ఆసీస్ ఆందోళన చెందుతోంది' అని అన్నాడు. 


ఛెతేశ్వర్‌ పుజారా ఇతర జట్టు కంటే ఎక్కువ పరుగులు మరియు సెంచరీలు ఆసీస్‌పైనే చేశాడు. ఆసీస్‌పై ఇప్పటివరకు ఆడిన 24 టెస్టుల్లో 2033 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో ఆడిన 24 మ్యాచ్‌ల్లో 1979 పరుగులు చేశాడు. బోర్డర్-గవాస్కర్ 2023 నాలుగో టెస్ట్‌లో కోహ్లీ అత్యధిక స్కోర్ 186 సాధించడంతో సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై కూడా విజయవంతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 


Also Read: LPG Cylinder Price Cut: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. గ్యాస్ రేటు తగ్గింపు.. ఆ ధరలు పెంపు   


Also Read: Flipkart Offers: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త, 80 వేల ఐఫోన్ 14 ఇప్పుడు కేవలం 34 వేలకే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.