Sachin Tendulkar About WTC Final: అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వమించిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓటమిపై లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఎంచుకున్న బౌలింగ్ కాంబినేషన్ మరియు లెఫ్టార్మ్ స్నిన్నర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయానికి దూరం చేశాడని అభిప్రాయపడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్టులు, వన్డేలలో ప్రపచంలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తన యూట్యూబ్ ఛానల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ తప్పిదాల గురించి నోరువిప్పాడు. ప్రతిష్టాత్మక ఫైనల్ టెస్టులో తొలుత కొన్ని రోజులపాటు ఎండ రాకపోవడం మైనస్ పాయింట్, స్పిన్నర్లు సైతం బౌలింగ్‌కు ఎక్కువగా రాలేదు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఎండ వచ్చిన తరువాత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 8 ఓవర్లు బౌలింగ్ చేయడం భారత్ ఓటమికి కారణమని చెప్పాడు.


Also Read: Team India ఆటగాడు అజింక్య రహానే ఔట్‌తో కంగుతిన్న ఫ్యాన్, Viral Video


‘జట్టులో ఐదు మంది స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఒకే సంఖ్యలో ఓవర్లు వేసే అవకాశం రాదు. పిచ్ పరిస్థితిని బట్టి, వాతావరణం, వీచే గాలిని బట్టి బౌలర్ల చేతికి బంతిని అందించాలి. ఈ టెస్టులో సూర్యుడు ఎక్కువగా రాలేదు. మరోవైపు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా 7.2 ఓవర్లతో పోల్చితే అశ్విన్ అధిక ఓవర్లు (15) చేశాడు. ఇది జడేజాకు నిరాశ కలిగించే విషయం. జట్టుపై సైతం ప్రభావం చూపింది. జడేజా చేతికి బంతి ఇచ్చి ఉంటే అతడు కచ్చితంగా స్టంప్స్ మీదకు బంతిని సంధించేవాడు. బ్యాట్స్‌మెన్ వికెట్లను అతడి బంతుల గిరాటేసేవి, లేకపోతే ఎల్బీడబ్ల్యూ రూపంలో కివీస్ ఆటగాళ్లు వికెట్లు కోల్పోయేవారు.


Also Read: WTC Winner: న్యూజిలాండ్ జయకేతనం, కివీస్ చేతిలో టీమిండియాకు మరో పరాభవం


ప్రతి బౌలర్‌గా ఒకే విధంగా బంతిని అందించడం అసాధ్యం. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. కానీ అనూహ్యంగా జడేజా చేత అధిక ఓవర్లు బౌలింగ్ చేయించలేదు. స్పిన్నర్లుకు కొన్ని పిచ్‌లు అనుకూలిస్తాయని, పేసర్లకు కొన్ని పిచ్‌లు అనుకూలిస్తాయని కెప్టెన్, మేనేజ్‌మెంట్  పరిస్థితిని అర్థం చేసుకోవాలని’ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపై సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook