World Test Championship 2023-25 Points Table: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగా.. రెండో టెస్ట్ వర్ష కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లపై ప్రభావం చూపించింది. భారత్ రెండో స్థానానికి పడిపోగా.. పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. విండీస్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన తరువాత భారత్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే రెండో టెస్టు డ్రా కావడంతో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం టీమిండియా ఖాతాలో ఒక విజయం, ఒక డ్రాతో మొత్తం 16 పాయింట్లు ఉన్నాయి. విజయానికి 12 పాయింట్లు రాగా.. డ్రాకు 4 పాయింట్లు యాడ్ అయ్యాయి. విజయశాతం  66.67 శాతం ఉంది. అటు శ్రీలంకపై మొదటి టెస్టులో గెలుపొందిన పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. గెలుపు శాతం 100గా ఉంది. దీంతో పాక్ జట్టు మొదటి స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ ఓడిపోయినా.. డ్రాగా ముగిసినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటాయి. 


 




మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది కంగారూ జట్టు. నాలుగు టెస్టులు ఆడిన ఆసీస్ (54.17), ఇంగ్లాండ్‌ (29.17) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. యాషెస్ సిరీస్‌లో ఆఖరి టెస్టు ఈ నెల 27న ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. డ్రా చేసుకున్న యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతమతుంది. 


టీమిండియాతో రెండో టెస్టు డ్రాగా ముగియడంతో వెస్టిండీస్ ఖాతాలో 4 డబ్ల్యూటీసీ పాయింట్లు ఉన్నాయి. 16.67 శాతంతో ఐదోస్థానానికి చేరుకుంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం ఇక ఇప్పట్లో టీమిండియా టెస్టు సిరీస్‌లు లేవు. ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌ నెలలో సఫారీ జట్టులో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి వెస్టిండీస్‌లో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది.


Also Read: Schools Colleges Bandh Today: రాష్ట్రంలో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..!  


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి