జహీర్ ఖాన్ బర్త్‌డే ప్రత్యేకత ఏమిటంటే..?
జహీర్ ఖాన్ తన 40వ పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంటుండగా.. అతని చిరకాల స్నేహితుడైన యూవీ ఆ ఫంక్షన్‌కు అనుకోని అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.
జహీర్ ఖాన్ తన 40వ పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంటుండగా.. అతని చిరకాల స్నేహితుడైన యూవీ ఆ ఫంక్షన్‌కు అనుకోని అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. జహీర్ బీచ్‌లో స్నానం చేయడానికి సిద్ధపడుతుండగా.. యువరాజ్ సింగ్ వైట్ టీషర్టు, బాక్సర్ ధరించి అతనితో ఫోటో దిగాడు. ఆ ఫోటోలను జహీర్ సతీమణి సాగరిక తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇదే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జహీర్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ అగార్కర్, ఆశిష్ నెహ్రాలు హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో రిటైర్ అయన జహీర్.. భారతదేశం గర్వించదగ్గ మేటి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ రోజు జహీర్ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకొని.. ట్విట్టర్ మొత్తం సెలబ్రిటీల విషెస్‌తో నిండిపోయింది. సచిన్ టెండుల్కర్ జహీర్ ఖాన్‌ను ఔట్ స్వింగింగ్ అండ్ ఔట్ థింకింగ్ క్రికెటరుగా పేర్కొంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా జహీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కాస్త బరువు తగ్గమని సరదాగా కామెంట్ చేశారు.
టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డులకెక్కిన జహీర్ ఖాన్... ఫాస్ట్ బౌలర్లలో కపిల్ దేవ్ తర్వాత ఆ ఘనత సాధించిన మేటి బౌలరుగా కూడా వార్తలలోకెక్కాడు. ఇప్పటి వరకూ భారతీయ బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413), జహీర్ ఖాన్ (300) మాత్రమే త్రీ హండ్రెడ్ క్లబ్బులో ఉన్నారు. అయితే కుంబ్లే, హర్భజన్లు స్పిన్నర్లు కాగా.. ఫాస్ట్ బౌలింగ్‌లో రికార్డులకెక్కిన ఘనత కపిల్, జహీర్ ఖాన్‌లకు మాత్రమే దక్కింది.