Rishabh Pant Test Captain: రోహిత్ శర్మ వద్దు.. టెస్ట్ కెప్టెన్‌గా రిషబ్ పంతే సరైనోడు: మాజీ క్రికెటర్
తాజాగా యువరాజ్ సింగ్ సైతం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచారు. భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా పంతే సరైనోడు అని పేర్కొన్నారు.
Yuvraj Singh wants Rishabh Pant to replace Virat Kohli as India's new Test captain: టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ (Virat Kohli) గుడ్‌బై చెప్పినప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఉన్నాడులే అని అనుకున్నారు. ఆపై వన్డే కెప్టెన్సీ కూడా హిట్‌మ్యాన్‌కే దక్కింది. అయితే టెస్టు సారథ్యానికి వచ్చేసరికి తర్వాతి నాయకుడు ఎవరు? అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. దీనిపై చర్చ విస్తృతంగా సాగుతోంది. టెస్టు జట్టుకు వైఎస్ కెప్టెన్ (India Test Captain)గా ఉన్న రోహిత్ శర్మకే పగ్గాలు అందుతాయి చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
అయితే రోహిత్ శర్మకు అతిపెద్ద ప్రతికూలాంశం ఫిట్‌నెసే. వయసు, ఫిట్‌నెస్, గాయాలతో సతమతమవుతున్న రోహిత్ వైపునకు బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపకపోవచ్చని కొందరి అభిప్రాయం. ఈ క్రమంలో కొందరు యువ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లలో ఒకరికి టెస్టు పగ్గాలు ఇవ్వొచ్చని అంటున్నారు. ముఖ్యంగా పంతే సరైనోడు అని ఇప్పటికే భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు. తాజాగా సన్నీకి మద్దతుగా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచారు.
Also Read: IPL 2022 : ఐపీఎల్ 2022లో కీలక మార్పులు, కెప్టెన్‌గా తప్పుకోనున్న ఎంఎస్ ధోని
'టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరని అడిగితే.. నేను మాత్రం రిషబ్ పంత్ పేరే చెబుతా. రికీ పాంటింగ్ ముంబై ఇండియన్స్ సారథిగా తప్పుకున్నప్పుడు రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించారు. ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్ ఎలా మారిపోయిందో మనం చూశాం. కెప్టెన్‌గా బాధ్యతనను నెత్తికెత్తుకున్న తర్వాత 30, 40, 50లను సెంచరీలు, 150, 200లుగా మార్చాడు. పంత్ కూడా బాధ్యతలు స్వీకరిస్తే.. మరింత బాగా రాణించగలుగుతాడని నా అభిప్రాయం. టైగర్ పటౌడీ 21 ఏళ్లకే టీమిండియా కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు' అని సన్నీ పేర్కొన్నారు.
తాజాగా యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సైతం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచారు. వికెట్ల వెనక నుంచి పంత్ ఆట మొత్తాన్ని లోతుగా అధ్యయనం చేసి.. మెరుగ్గా జట్టును నడిపిస్తాడని యువీ అభిప్రాయపడ్డారు. 'అబ్‌సొల్యుట్లీ! రీడ్స్ ద గేమ్ వెల్ బిహైండ్ ద స్టంప్స్' అంటూ సునీల్ గవాస్కర్ కామెంట్‌కు యువీ ట్విటర్‌లో స్పందించారు. మొత్తానికి రోహిత్ శర్మ వద్దు.. టెస్ట్ కెప్టెన్‌గా రిషబ్ పంతే ముద్దు అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Horoscope January 17 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి