హైదరాబాద్: వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన పరపంపరను వరుసగా వీరేంద్ర సెహ్వాగ్ 2011 లో వెస్టిండీస్‌పై 219 పరుగులు చేయడం ద్వారా వీరేందర్ సెహ్వాగ్ సచిన్‌ను సమం చేశాడు. మరో డబుల్ సెంచరీల వీరుడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ Rohit Man బెంగళూరులో ఆస్ట్రేలియాపై తొలిసారిగా డబుల్ సెంచరీ చేసి వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. శ్రీలంకపై 264 పరుగులు చేసిన వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. రోహిత్ స్పందిస్తూ భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తనను ప్రోత్సహించాడని వెల్లడించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: పట్టాలు తప్పిన శ్రామిక్ రైలు..!!


అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో రోహిత్‌ను సరదాగా గుర్తు చేసుకుంటూ నేను డబుల్ సెంచరీ సాధించిన తరువాత డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళినప్పుడు మరొక ఓవర్ బ్యాటింగ్ చేసి ఉంటే వీరేందర్ సెహ్వాగ్ రికార్డును కూడా బద్దలు కొట్టేవారని తన జట్టు సభ్యులు తనతో పంచుకున్న విషయాలను వెల్లడించాడు. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ ఇండియాకు 383 పరుగులు చేయటానికి సహాయపడగా, 57 పరుగుల తేడాతో భరత్ ఈ మ్యాచ్ గెలిచింది.


వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టీ20, 32 టెస్టులు ఆడాడు. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ అన్ని ఫార్మాట్లలో 14,029 పరుగులు చేశాడు. ఎంతో ఉత్సహంగా కన్నుల పండుగగా ఉండాల్సిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఎక్కడివారక్కడే ఇరుక్కుపోయారు. కరోనా మహమ్మారి కారణంగా నిరవధికంగా నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..