Zee News Sting Operation: జి న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జీ న్యూస్ నిఘాలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ క్రికెట్ ప్రియులను విస్తుగొలిపే అంశాలు వెల్లడించారు. ఇప్పటి వరకు బీసీసీఐలో నాలుగు గోడల మధ్యే పాతిపెట్టినట్టుగా ఉన్న రహస్యాలను జీ మీడియా ఛేదించింది. చేతన్ శర్మ చెప్పిన సంచలన విషయాలు జీ మీడియా సీక్రెట్ కెమెరాకు చిక్కాయి. టీమ్ ఇండియాలో ఫేక్ ఫిట్‌నెస్ ఇంజెక్షన్స్ వినియోగం మొదలుకుని సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదానికి అసలు కారణం వరకు మరెన్నో విస్తుగొలిపే అంశాలను చేతన్ శర్మ స్వయంగా తన నోట తనే చెప్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియాలో మీకు ఇష్టమైన ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా మరొకరికి ఛాన్స్ రావడం చూసినప్పుడల్లా మీకొచ్చే మొదటి సందేహం వీళ్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు.. ఫలానా ఆటగాడిని ఎందుకు డ్రాప్ చేశారు అనే కదా.. అయితే, అలాంటి నిర్ణయాలు ఎవరివి, ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అనే సంచలన విషయాలు వెల్లడిస్తూ చేతన్ శర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు బిసిసిఐని గజగజా వణికిస్తున్నాయి.


చేతన్ శర్మ చెప్పిన సంచలన విషయాలు ఏంటంటే..
భారత క్రికెట్‌లో 21వ శతాబ్దంలోనే అతిపెద్ద వివాదానికి దారితీసే అతి కీలకమైన అంశం ప్రస్తుతం ZEE NEWS స్టూడియోలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జీ మీడియా సీక్రెట్ కెమెరా ముందు వెల్లడించిన ఎన్నో సీక్రెట్స్ బీసీసీఐనే కాదు.. బిసిసిఐకి పెద్దన్న అయిన ఐసిసిని సైతం కుదిపేస్తున్నాయి.


టీమ్ ఇండియాలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాళ్లకు సంబంధించిన ఎన్నో నమ్మలేని సీక్రెట్స్ ని జీ న్యూస్ బట్టబయలుచేసింది. జీ న్యూస్ కెమెరా ముందు చేతన్ శర్మ చెప్పిన విషయాలు వింటుంటే.. ఇంతకాలం మనమంతా మోసపోయామా అని క్రికెట్ ప్రియులకు సందేహం రాకమానదు. తమ ఫేవరైట్ క్రికెటర్స్ ఇలా మోసం చేస్తున్నారా అనే ఆలోచనే మిమ్మల్ని తట్టుకోనివ్వకుండా చేస్తుందంటే ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు.


టీమ్ ఇండియాలో ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్ గేమ్ 
బిగ్ స్టార్ ప్లేయర్స్ ఫిట్‌నెస్‌పై బిసిసిఐ ఉద్దేశపూర్వకంగా ఎందుకు నిర్లక్ష్యం చేసిందనే నిజం తొలిసారిగా ప్రపంచం ముందుకొచ్చిన సమయం ఇది.
సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన ఘర్షణ ఏంటి ? దాదాపు బిసిసిఐ బోర్డు vs కెప్టెన్ అన్నట్టుగా సాగిన ఫైట్‌లో అసలేం జరిగిందో మీకు అర్థమయ్యే సమయం రానే వచ్చింది.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి మీ ఫేవరైట్ క్రికెటర్లు చీఫ్ సెలెక్టర్‌ను ఎలా సంతోషపెట్టి, వారి నుంచి ఎలాంటి లబ్ధి పొందారు అనేది కూడా మీరు తెలుసుకునే సమయం ఇది. 
అప్పటి వరకు గొప్ప గొప్ప ఆటగాళ్లుగా పేరుండి... ఆ తరువాత విశ్రాంతి పేరిట క్రికెట్‌కి ఎలా దూరమయ్యారనేది మీకు అర్ధమయ్యే సమయం ఇది. 


టీమ్ ఇండియాలో అర్హత సంపాదించడం కోసం, ఫిట్‌నెస్‌ని చూపించుకోవడం కోసం ఆటగాళ్లు ఏం చేస్తున్నారు ? ఇదంతా బిసిసిఐకి తెలిసే జరుగుతోందా ? ఒకవేళ తెలిసే జరిగితే అన్నీ తెలిసి కూడా టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ ఆ నేరాన్ని ఎందుకు ఆపలేకపోయారు ? ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎవరిపై ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వస్తున్నాయి ? అనే అనేక సంచలన విషయాలను జీ మీడియా ఈ స్టింగ్ ఆపరేషన్‌తో మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచ టీవీ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద స్టింగ్ ఆపరేషన్. అది కూడా స్వయంగా బీసీసీఐ నుంచే బట్టబయలు కావడం మరో సంచలనం.