షార్జా: T10 క్రికెట్ లీగ్ ఫైనల్స్‌లో భాగంగా నేడు షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా నార్తర్న్ వారియర్ జట్టు పాఖ్టూన్స్ జట్టుతో తలపడనుంది. ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డారెన్ సమీ కెప్టెన్‌గా ఉన్న నార్తర్న్ వారియర్స్ జట్టుకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తోంది. T10 క్రికెట్ లీగ్ 2వ సీజన్‌లో పాల్గొంటున్న నార్తర్న్ వారియర్స్‌ జట్టులో సమీతోపాటు పాక్ క్రికెటర్ వాహబ్ రియాజ్, విండీస్ ఆటగాళ్లు డ్వేన్ స్మిత్, సైమన్స్, దుబాయ్ ఆటగాడు ఇమ్రాన్ హైదర్, ఇంగ్లండ్ ఆటగాడు రవి బొపార, ఆస్ట్రేలియా నుంచి క్రిస్ గ్రీన్, భారత ఆటగాడు అమిటోజ్ సింగ్ వంటి ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. ఇండియన్ ఆల్-రౌండర్ రాబిని సింగ్ నార్తర్న్ వారియర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 21న ప్రారంభమైన 2వ సీజన్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ఈ ఏడాది ఈ లీగ్‌లో ప్రవేశించిన మూడు కొత్త జట్లలో నార్తర్న్ వారియర్స్ జట్టు కూడా ఒకటి. ప్రవేశించిన తొలి ఏడాదే జట్టు ఫైనల్స్‌కి చేరడం పట్ల నార్తర్న్ వారియర్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తంచేశారు. ఫైనల్స్‌లోనూ శాయశక్తులా కృషిచేసి టైటిల్‌ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని సమి విశ్వాసం వ్యక్తంచేశాడు.


నార్తర్న్ వారియర్స్ జట్టు ఆటగాళ్లు : సైమన్స్, నిఖోలస్ పూరన్, ఆండ్రె రస్సెల్, రవ్‌మన్ పావెల్, రవి బొపార, అమిటోజ్ సింగ్, డారెన్ సమీ (కెప్టేన్), హార్డుస్ విల్జెన్, ఇమ్రాన్ హైదర్, క్రిస్ గ్రీన్, వాహబ్ రియాజ్, డ్వేన్ స్మిత్, హ్యారీ గుర్నీ, ఖేరీ పీర్, కెన్నార్ లూయిస్, రాహుల్ భాటియా.


పాఖ్టూన్స్ జట్టు ఆటగాళ్లు : షాహిద్ అఫ్రిదీ, కొలిన్ ఇంగ్రమ్, డేవిడ్ విల్లీ, మొహమ్మద్ ఇర్ఫాన్, లియమ్ డేసన్, కొలిన్ మున్రో, ఆండ్రె ఫ్లెచర్, సోహైల్ ఖాన్, షత్రఫుద్దీన్ అష్రఫ్, చాదిక్ వాల్టన్, షాపూర్ జద్రన్, గుల్బదిన్ నయబ్, కెమరాన్ డెల్‌పోర్ట్, హఫీజ్ ఖలీమ్, షీర్ వల్లి, ఆర్పీ సింగ్.