Shubman Gill and Mohammed Siraj: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ 830 పాయింట్లతో నంబర్ 1 స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్  824 పాయింట్లతో నంబరు 2కి పడిపోయాడు. తక్కువ ఇన్నింగ్స్‌ (41)లలో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు గిల్. ఎంఎస్ ధోని 38 ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. గిల్ ఈ ఏడాది 2023లో 63 సగటుతో 103.72 స్ట్రైక్ రేట్‌తో 1449 పరుగులు చేశాడు. వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు 208తోపాటు 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు కొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. డెంగ్యూ జ్వరం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేదు. ఆ తరువాత ఆరు మ్యాచ్‌ల్లో 36.50 సగటుతో 219 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.     అయితే గిల్‌ నుంచి అభిమానులు ఇంకా భారీ ఇన్నింగ్స్‌లు ఆశించారు. సెమీస్, ఫైనల్‌లో ఈ యంగ్ ఓపెనర్ చెలరేగాలని కోరుకుంటున్నారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచకప్‌లో  8 ఇన్నింగ్స్‌లలో 40.28 సగటుతో 282 పరుగులు చేశాడు. గిల్ తరువాత టీమిండియా బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ 4, రోహిత్ శర్మ 6వ స్థానంలో నిలిచారు.


బౌలింగ్‌లో విభాగంలో మహ్మద్ సిరాజ్ వరల్డ్ నెంబర్ వన్‌గా బౌలర్‌గా నిలిచాడు. సిరాజ్ 709 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 694 పాయింట్లతో కేశవ్ మహరాజ్, 662 పాయింట్లతో ఆడమ్ జంపా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకపై అద్భుతమైన ప్రదర్శనతో సిరాజ్ ఆకట్టుకున్నాడు. ఆసియా కప్‌లో ఫైనల్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో సిరాజ్ తరువాత  కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (8), మహ్మద్ షమీ (10) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. 


బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించినా.. ఆల్ రౌండర్ జాబితాలో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మంగళవారం ముంబైలో అఫ్గానిస్థాన్‌తో సంచలన ఇన్నింగ్స్‌ తరువాత రెండు స్థానాలు మెరుగుపడి ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా తరుఫున రవీంద్ర జడేజా 10వ స్థానంలో ఉన్నాడు. మహ్మద్ నబీ రెండోస్థానంలో ఉన్నాడు. టీమిండియా ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది


Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి