OPPO A1 5G Price: ఒప్పో నుంచి సూపర్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ! డిజైన్‌కు ఫిదా అవ్వాల్సిందే
Cheapest 5G Smartphone, OPPO Launch OPPO A1 5G Smartphone. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో ఈ వారం ప్రారంభంలో చైనాలో ఒప్పో ఏ1 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లను అందుబాటులోకి తెచ్చింది.
OPPO Launch OPPO A1 5G Smartphone: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు 'ఒప్పో' ఈ వారం ప్రారంభంలో చైనాలో ఒప్పో ఏ1 5జీ (OPPO A1 5G) స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈరోజు నుంచి చైనా మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఒప్పో ఏ1 5జీ ఫోన్‌లో మంచి ర్యామ్, పెద్ద స్క్రీన్, కూల్ కెమెరా మరియు బలమైన బ్యాటరీని అందించారు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర మరియు ఫీచర్లను తెలుసుకుందాం.
Oppo A1 5G Price:
ఒప్పో ఏ1 ఒకే కాన్ఫిగరేషన్‌తో ప్రారంభించబడింది. 12 GB RAM మరియు 256 GB స్టోరేజ్ ధర 1999 యువాన్లు. భారత కరెన్సీలో ఈ ఫోన్ ధర దాదాపు 23 వేల రూపాయలు. ఈ ఫోన్ మూడు రంగులలో విడుదల చేయబడింది (సాండ్‌స్టోన్ బ్లాక్, హవోహై బ్లూ మరియు కాబర్నెట్ ఆరెంజ్). లెదర్ ఫినిషింగ్ ఆరెంజ్ ఈ వేరియంట్‌లో వెనుకవైపు అందుబాటులో ఉంటుంది.
OPPO A1 5G Specifications:
ఒప్పో ఏ1 స్మార్ట్‌ఫోన్ 1080 x 2400 పిక్సెల్‌ల పూర్తి HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఒప్పో ఏ1లో 91.4 శాతం స్క్రీన్ స్పేస్ ఉందని కంపెనీ పేర్కొంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ రానుంది.
OPPO A1 5G Camera:
ఒప్పో ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. LED ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లో ఫోన్ 0 నుండి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
Also Read: Budh Asta 2023: అస్తమిస్తున్న బుధుడు.. 9 రోజుల తర్వాత ఈ రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.