5G Phones Under Rs. 20K: రూ. 15 వేల నుంచి 20 వేల మధ్య చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్స్
5G Phones Under Rs. 20,000 Budget: 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా ? అది కూడా రూ. 20 వేల లోపు లేదా అంతకంటే కొంత తక్కువ బడ్జెట్లోనే ధర ఉండేలా ప్లాన్ చేస్తున్నారా ? నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం 5000mAh బ్యాటరీ ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారా ? అయితే, మీరు రైట్ ప్లేస్‌కే వచ్చారు. ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి.
వన్‌ప్లస్ నార్ CE 3 లైట్ 5G ఫోన్ :
వన్‌ప్లస్ నార్ సీఈ 3 లైట్ 5G ఫోన్ ధర రూ. 19,999 గా ఉంది. 6.72 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP ప్లస్ 2MP కెమెరాలు ఉన్నాయి. స్నాప్‌డ్రాగాన్ 695 ఎస్ఓసి సహాయంతో రన్ అయ్యే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసి ఉంది.
ఒప్పో A78 5G ఫోన్ :
ఒప్పో A78 5G ఫోన్ ధర రూ. 18,999 గా ఉంది. 6.56 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP కెమెరాను అమర్చారు. మీడియాటెక్ 6833 ఎస్ఓసి ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ సహాయంతో రన్ అవుతుంది.
వివో Y56 5G ఫోన్ :
వివో Y56 5G ఫోన్ ధర రూ. 19,999 కాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP కెమెరాను ఫిక్స్ చేశారు. డైమెన్సిటీ 700 ఎస్ఓసి ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఇన్‌స్టాల్ చేశారు.
మోటో G62 5G :
మోటో G62 5G ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP ప్లస్ 2MP కెమెరాలను అమర్చారు. స్నాప్‌డ్రాగాన్ 695 ఎస్ఓసి ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 సహాయంతో రన్ అవుతుంది.
రియల్‌మి 10 ప్రో 5G :
రియల్‌మి 10 ప్రో 5G ఫోన్ ధర రూ. 18,999 keie 6.72 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP కెమెరాను అమర్చారు. స్నాప్‌డ్రాగాన్ 695 ఎస్ఓసి సహాయంతో రన్ అయ్యే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌తో లాంచ్ అయింది.
వివో T2x 5G ఫోన్ :
వివో T2x 5G ఫోన్ ధర కేవలం రూ. 15,999 మాత్రమే. లో బడ్జెట్ 5G ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP రియర్ కెమెరాతో పాటు 2MP కెమెరా ఉంది. డైమెన్సిటీ 6020 ఎస్ఓసి ప్రాసెసర్ ని అమర్చారు. ఆండ్రాయిడ్ 13 తో వచ్చే ఈ ఫోన్ చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్లలో ఒకటిగా పేరుంది.