Hidden Camera: మన ప్రైవేట్ విషయాలు హిడెన్ కెమేరాతో రికార్డు చేయడం, లీక్ చేయడం ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. అయితే ఇప్పుడు హిడెన్ కెమేరాను సైతం వెతికితీసే డివైస్ మార్కెట్లో లభ్యమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పై కెమేరాలు, హిడెన్ కెమేరాల ప్రాచుర్యం పెరిగే కొద్దీ కొందరి ప్రైవేట్ జీవితాలు, ప్రైవేట్ వీడియోల చిత్రీకరణ సమస్యగా మారింది. ఫలితంగా సంబంధిత వ్యక్తి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఏదైనా సమావేశాలకు వెళ్లినా లేదా ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు లేదా హోటల్స్ , రిసార్ట్స్‌లో స్టే చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఏ కెమేరాలున్నాయో తెలియని పరిస్థితి. హిడెన్ కెమేరాలతో వ్యక్తుల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి లీక్ చేయడం లేదా బ్లాక్ మెయిల్ చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ ఎలాటి రహస్య కెమేరా ఉన్నా వెతికితీసే డివైస్ మార్కెట్‌లో లభ్యమౌతోంది.


ఈ డివైస్ పేరు హిడెన్ కెమేరా ఫైండర్. ఇది ఒక ఛైన్ ఆకారంలో ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ లైట్స్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్ లైట్స్ కూడా ఉంటాయి. ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో వ్యూ ఫైండర్ కూడా ఉంటుంది. హిడెన్ కెమేరా పెట్టే అవకాశమున్న చోట ఈ డివైస్ తీసుకెళితే..ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. 


ఈ డివైస్ ఈ కామర్స్ వేదికల్లో లభ్యమౌతోంది. ఈ డివైస్ ధర విభిన్న సైట్స్‌లో వేర్వేరుగా ఉంది. 2500 నుంచి 3000 వరకూ ఉంటుంది. హిడెన్ కెమేరా వెతకడంలో ఈ డివైస్ అద్భుతంగా పనిచేస్తుంది. 


Also read: SBI: ఇకపై ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు ఉండవు..ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo