Aadhaar-Ration Card Link: మీకు రేషన్ కార్డు ఉంటే, మీరు ప్రతి నెలా ప్రభుత్వం నుండి ఉచిత రేషన్ తీసుకుంటే మీ కోసమే ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. దేశంలో ఉన్న ప్రతి రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీనికి, 31 మార్చి 2023 చివరి తేదీగా ప్రకటించింది. ఇప్పుడు ఆధార్- రేషన్ కార్డ్ లింక్ చేసే తేదీ జూన్ 30, 2023 వరకు పొడిగించబడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 30, 2023 తేదీ నాటికి, మీరు ఆధార్- రేషన్ కార్డ్ ఒకదానితో ఒకటి లింక్ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్ - రేషన్ కార్డుల లింక్ తేదీని పొడిగిస్తూ ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆధార్-రేషన్ కార్డ్ లింక్ కోసం కేంద్ర ప్రభుత్వం జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించిన క్రమంలో రేషన్ కార్డు - ఆధార్ కార్డును లింక్ చేసిన తర్వాత, అవసరమైన వారికి ఆహార ధాన్యాలలో వారి వాటా లభిస్తుందో లేదో నిర్ధారించడం సులభం అని ప్రభుత్వం విశ్వసిస్తోంది. 


నిజానికి 31 మార్చి 2023కి ముందు, ఆధార్ మరియు రేషన్ కార్డ్‌ని లింక్ చేయడానికి 31 డిసెంబర్ 2022 వరకు సమయం ఇవ్వబడింది. అలా ఈ చివరి తేదీని పొడిగించడం ఇది రెండోసారి అని చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డును వన్ నేషన్-వన్ రేషన్‌గా ప్రకటించినప్పటి నుంచి రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంపై దృష్టి సారిస్తోంది.


ఈ క్రమంలో ఆధార్- రేషన్ కార్డ్ ఒకదానితో ఒకటి లింక్ చేసిన తర్వాత, అవినీతి, అక్రమాలను అరికట్టవచ్చని భావిస్తోంది. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంతో వలస వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో నివస్తున్న వారు ఎంతో మేలు పొంద‌నున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం తాత్కాలిక కార్యాలయంలో రేషన్ అందుకోలేని వ్యక్తులు ఆధార్- రేషన్ కార్డ్ ఒకదానితో ఒకటి లింక్ అయిన వెంటనే ఎక్కడి నుండైనా రేషన్ పొందగలుగుతారు.


  • నిజానికి మీరు ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయవచ్చు ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. 

  • మీ రాష్ట్ర అధికారిక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) పోర్టల్‌ని సందర్శించండి

  • యాక్టివ్ కార్డ్‌తో లింక్ ఆధార్‌ను ఎంచుకోండి

  • మీ రేషన్ కార్డ్ నంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి

  • కొనసాగించు బటన్‌ను ఎంచుకోండి

  • ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్‌లో OTP వస్తుంది 

  • ఆధార్ రేషన్ లింక్ పేజీలో OTPని ఎంటర్  చేయండి 

  • తరువాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది 

  • ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు దాని గురించి తెలియజేసే SMSని అందుకుంటారు


Also Read: Thaman Copy Tune: శంకర్ ను కూడా మోసం చేసిన తమన్.. ట్యూన్ అక్కడి నుంచి తెచ్చాడా?


Also Read: PAN-Aadhaar Linking: పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌కి లింక్ చేశారో చెక్ చేశారా..లేట్ ఫీజుతో లింక్ చేయండిలా!



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook