AC Gas Leak Symptoms: మీరు ఏసీ ఆన్‌ చేసిన తరువాత ఎంతసేపు అయినా కూలింగ్ కాకపోతే వెంటనే ఏదో రిపేర్ ఉందని మెకానిక్‌కు ఫోన్ చేస్తారు. ఏసీ రిపేర్ చేసేవాళ్లు మీ ఇంటికి వచ్చి.. ఏసీలో డస్ట్ ఉంది క్లీన్ చేయాలి.. గ్యాస్ కూడా అయిపోయింది.. ఫిల్ చేయాలని చెప్పడం మీరే వినే ఉంటారు. అయితే ప్రస్తుతం ఎయిర్ కండీషనర్‌లో గ్యాస్ అయిపోందనే పేరుతో పెద్ద మోసం జరుగుతోంది. కొందరు ఏసీ మెకానిక్‌లు గ్యాస్ అయిపోయిందని.. గ్యాస్ ఫిల్ చేస్తామంటూ అనవసరంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజంగా గ్యాస్ లీకేజీ ఏర్పడి గ్యాస్ అయిపోతుంటే ఒకేగానీ.. ఎలాంటి లీకేజీ లేకున్నా గ్యాస్ నింపుతామంటూ డబ్బులు తీసుకుంటున్నారని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైందా..? ఏసీ రిపేర్ కోసం ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారా..? ఇక నుంచి అలా చేయకండి. 


మీ ఇంట్లో స్ప్లిట్ ఏసీని ఇన్‌స్టాల్ చేసి ఉంటే.. గ్యాస్ లీకేజీ ఉందా..? లేదా..? అని మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఏ టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదు. మీరు సెట్ చేసిన ఏసీ యూనిట్‌ను సరిచూడండి. పైపును చెక్ చేస్తే గ్యాస్ లీకేజీ జరుగుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. గ్యాస్ లీకైన చోట పైపుపై గ్రీజు పేరుకుపోయి ఉంటుంది. లూబ్రికేషన్ అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటే.. గ్యాస్ ఫిల్లింగ్‌ను పూర్తి చేయాలి. లేకపోతే గ్యాస్ నింపాల్సిన అవసరం లేదు.


మీరు ఏపీ ఆన్‌ చేసిన తరువాత 17 నుంచి 20 డిగ్రీల మధ్య కాసేపు ఉంచండి. అయినా మీకు కూలింగ్ రాకపోతే.. మీ ఎయిర్ కండీషనర్‌కు గ్యాస్ ఫిల్లింగ్ అవసరమని తెలిసిపోతుంది.  సాధారణంగా 17 నుంచి 20 డిగ్రీల వద్ద ఏసీని ఉపయోగిస్తే.. 5 నుంచి పది నిమిషాల్లో రూమ్ కూల్ అయిపోతుంది. ఒక్కోసారి ఇంకాస్త టైమ్ తీసుకుంటుంది. అయినా కూలింగ్ రాకపోతే అప్పుడు గ్యాస్ అయిపోయిందని అర్థం. అనవసరంగా ఏసీ మెకానిక్‌లకు గ్యాస్ ఫిల్లింగ్ పేరుతో ఎక్కువ డబ్బులు చెల్లించి మోసపోకండి.


Also Read: Salaar Movie: సలార్ సినిమాపై పెరిగిన అంచనాలు, 2000 కోట్లు దాటేస్తుందా


Also Read: Yatra 2 Movie: యాత్ర 2 సినిమాపై ఎవరేమనుకున్నా ఫరవాలేదు, ఎన్నికల ముందే విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి