Acer Swift Go Launch: ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
Acer Launched Acer Swift Go Laptop in India. కొత్త ల్యాప్‌ట్యాప్‌ను ఏసర్ భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఏసర్ స్విఫ్ట్ గో పేరుతో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది.
Acer released Acer Swift Go Laptop in India: తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్‌కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తూ కస్టమర్లను ఆటకుంటోంది. ఈ క్రమంలోనే కొత్త ల్యాప్‌ట్యాప్‌ను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఏసర్ స్విఫ్ట్ గో (Acer Swift Go) పేరుతో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఏసర్ ఈ స్టోర్, విజయ్ సేల్స్, అమెజాన్, క్రోమా నుంచి ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయొచ్చని ఏసర్ పేర్కొంది. అత్యుత్తమ ఫీచర్లతో ఈ ల్యాపీని తీసుకొచ్చిన్నట్లు చెప్పింది. ఏసర్ స్విఫ్ట్ గో ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చూద్దాం.
ఏసర్ స్విఫ్ట్ గో ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ SSD స్టోరేజీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 79,990గా ఉంది. ఇందులో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-13500H ప్రాసెసర్‌ను అందించింది. 14 అంగుళాల WQXGA+2.8K ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, బయోమెట్రిక్ అథెంటికేషన్ సదుపాయం ఈ ఈ ల్యాపీలో ఉంది. 65Whr బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. టైప్-సి పోర్టు ద్వారా దీన్ని ఛార్జ్ చేయొచ్చు. కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను నాలుగు గంటలు వాడుకోవచ్చని ఏసర్ కంపెనీ పేర్కొంది.
ఏసర్ స్విఫ్ట్ గో ల్యాప్‌టాప్‌లో యూఎస్‌బీ 3.2 పోర్ట్, యూఎస్‌బీ 3.2 జెన్ పోర్ట్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, హెచ్‌డీఎంఐ 1.4 పోర్టు ఉంటాయి. అదనపు మెమొరీ కోసం ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. విండోస్ 11 హోమ్, ఎంఎస్ ఆఫీస్ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా వస్తున్నాయి. ఇక టి-టైప్ యూఎస్‌బీ కెమెరాను ఈ ల్యాప్‌టాప్‌లో ఇచ్చారు. టచ్‌ప్యాడ్ వివిధ గెశ్చర్లకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ల్యాపీ సిల్వర్ కలర్‌లో ఉంటుంది. ఈ ల్యాపీ బరువు 1.25 కిలోగ్రాములు అని ఏసర్ కంపెనీ పేర్కొంది.
ఏసర్ స్విఫ్ట్ గో ల్యాప్‌టాప్ ఫీచర్లు:
# 16 జీబీ ర్యామ్
# 512 జీబీ SSD స్టోరేజీ
# విండోస్ 11 హోమ్
# ఎంఎస్ ఆఫీస్
# 14 అంగుళాల WQXGA+2.8K ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
# 65Whr బ్యాటరీ
# టైప్-సి పోర్టు
# టి-టైప్ యూఎస్‌బీ కెమెరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.