Air Cooler For Home: భారత్‌లో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగాయి. ముఖ్యంగా ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అనారోగ్య సమస్యల కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ శరీరానికి చల్లదనం కలిగేందుకు పలు రకాల జాగ్రత్తలు తప్పని సరి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎయిర్‌ కండీషనర్స్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇప్పటికే  కూలర్ల వినియోగం కూడా పెరిగిపోయింది. అయితే మధ్యతరగతి వారు  కూలర్ల ద్వారా కూడా ఏసీ లాంటి చల్లదనం పొంది..అధిక ఉష్ణోగ్రతల నుంచిర సులభంగా ఉపశమనం పొందొచ్చు. ఈ టీప్స్‌ పాటిస్తే కూలర్ నుంచి కూడా ఏసీ లాంటి గాలిని పొందొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిటికీ దగ్గర ఇలా చేయండి:
మీ గదిని మొత్తం చల్లదనంగా ఉంచుకోవడానికి భయట కీలకిల నుంచి గాలి వచ్చే ప్రదేశంలో అక్కడ కూలర్‌ను ఉంచాల్సి ఉంటుంది. కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచడం వల్ల మీరు పడుకునే గది కూల్‌గా మారుతుంది. కావాలనుకుంటే విండో కూలర్‌ని ఉపయోగించవచ్చు. విండో కూలర్ల పెట్టే క్రమంలో ఫ్యాన్‌ను కేవలం మన గది వైపు పెట్టుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కూలర్‌లో ఎప్పుడు నీటిని పోసి ఉంచుకోవడం వల్ల చల్లని గాలిని పొందొచ్చు.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం


ఐస్‌ను ఇలా వినియోగించండి:
కూలర్ నుంచి రెట్టింపు చల్లదనం పొందడానికి ఐస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం కూలర్‌లో ఐస్‌ ముక్కలను లేదా చల్లటి నీటిని వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్యాడ్స్‌ చల్లగా మారి ఎక్కువ చల్లదనం మీరు పొందొచ్చు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ మొదలైన ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ట్రిక్ సహాయంతో మీరు సులభంగా చల్లటి గాలి పొందొచ్చు.


మీ కూలర్‌ నుంచి ఎక్కవ గాలిని పొందడానికి..మొదట కూలర్  మోటారు ఆన్‌ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కూలర్ ప్యాడ్‌లు తడిసిపోతాయి. ఆ ప్యాడ్‌లు తడిచిన తర్వాత ఫ్యాన్స్‌ను ఆన్‌ చేయడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు. అంతేకాకుండా గది మొత్తం చల్లని గాలితో నిండి ఉంటుంది.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook