Airtel Prepaid Plan Price Hike: ఎయిర్‌టెల్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. ఎయిర్‌టెల్ యూజర్లకు త్వరలో భారీ షాక్ తగలబోతోంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను కంపెనీ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్లాన్‌లపై పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా.. వాయిదా వేస్తూ వస్తోంది. త్వరలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మనీ కంట్రోల్‌తో మాట్లాడిన ఎయిర్‌టెల్ సీఈఓ సునీల్ మిట్టల్.. ఏఆర్‌పీయూ నెలకు రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెలికాం కంపెనీలు ఏఆర్‌పీయూని నెలకు రూ.300 పెంచితే.. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎందుకంటే వినియోగదారులు ప్రతి నెలా 60 జీబీ డేటాను వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vi ప్లాన్ల ధర పెరిగే అవకాశం..


కేవలం ఎయిర్‌టెల్ మాత్రమే కాకుండా.. ఇతర టెలికాం కంపెనీలు కూడా ఇదే ప్లాన్‌ను రూపొందించబోతున్నాయి. ప్లాన్ల ధర పెంచడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే Vi కూడా ప్లాన్ల ధరలను పెంచేందుకు ప్లాన్ చేస్తోంది.


ఎయిర్‌టెల్‌కు ప్రయోజనం 


Q2 FY22 ప్రకారం.. ఎయిర్‌టెల్ అత్యధిక ఏఆర్పీయూను కలిగి ఉంది. నివేదిక ప్రకారం.. ఎయిర్‌టెల్ ఏఆర్పీయూ రూ.190. జియో ఏఆర్పీయూ రూ.177. అన్నికంటే తక్కువ ఏఆర్పీయూ VI కలిగి ఉంది. వారి ఏఆర్పీయూ రూ.131. టారిఫ్ ప్లాన్‌ల ధరను పెంచినా.. జియో, Vi రూ.300కి చేరుకోలేవు. ఎందుకంటే ధర ఏకరీతిగా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను పెంచితే.. ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.


5G ప్లాన్‌ల ధర ఎంత..?


5G ప్లాన్‌ల ధర తక్కువగా ఉంటుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్లాన్‌కు ఎంత ఖర్చవుతుందో చెప్పలేదు. అదే సమయంలో జియో తన ప్లాన్‌ల ధర ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంటుందని పేర్కొంది. ఎయిర్‌టెల్ 4జీ ప్లాన్‌ల ధరకే 5జీ ప్లాన్‌లను అందించనున్నట్లు తెలిపింది. కాగా Vi చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతానికి దాని 5G సేవ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.


Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  


Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook