Amazon Freedom Sale 2023: OnePlus స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్..మొబైల్ కొనాలనుకుంటే ఇప్పుడే మంచి ఛాన్స్
Amazon Freedom Sale 2023: అమెజాన్‌లో మరో సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ భాగంగా మీరు OnePlus కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే డెడ్ ఛీప్ ధరలకే లభిస్తాయి. అయితే ఈ సేల్‌లో ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Amazon Freedom Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో మరో సేల్ ప్రారంభమైంది. కంపెనీ ఈ సేల్‌ను గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరుతో కస్టమర్లకు పరిచయం చేసింది. అయితే ప్రైమ్ కస్టమర్లకు ఈ రోజు 12 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులో వచ్చింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభించబోతున్నాయి. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తే 50 శాతం నుంచి 55 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ సేల్ స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభించబోతోంది. ముఖ్యంగా OnePlus బ్రాండ్ స్మార్ట్ ఫోన్‌లపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభిస్తోంది. అయితే డెడ్ ఛీప్ ధరలతో ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్‌లను ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈ స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్:
OnePlus Nord CE 3 5G:
ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్‌కి చెందిన Nord CE 3 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్ భాగంగా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 24,999లకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.26,999 కాగా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ భాగంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
OnePlus Nord 3 5G:
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఆఫర్ భాగంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 33,999గా ఉండగా ఈ ఆఫర్స్‌లో భాగంగా రూ.32,999లకే లభిస్తోంది.
OnePlus 11R 5G:
ఈ సేల్‌లో OnePlus 11R 5G మొబైల్‌పై కూడా డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ. 39,999 ఉండగా ఈ సేల్‌లో భాగంగా రూ.38,999లకే లభిస్తోంది. ఇక ఫీచర్ల వివరాలకు వస్తే.. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటుంది.
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook