Amazon Great Indian Festival: అమెజాన్ లో అద్భుతమైన డీల్.. అతి తక్కువ ధరకే ఐ ఫోన్ 13
ఐ ఫోన్ 13 అంటే ఇష్టం ఉన్నవారికి ఇదొక అభూత అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మారేందుకు ఆలస్యం ఆ వివరాలు చూసేయండి మరీ!
Amazon Great Indian Festival: ఐ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. ఎందుకంటే.. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ లో ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లు ఉన్నాయి. 2021 లో iPhone 13 లాంచ్ చేయబడింది. ఐ ఫోన్ 15 లంచ్ తరువత ఐ ఫోన్ 13 ధర తగ్గింది. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఇటీవలే విడుదలైన ఐ ఫోన్ 15 సీరీస్ కన్నా.. ఐఫోన్ 13 కే డిమాండ్ ఎక్కువ. ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లకు ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది.
ఐ ఫోన్ 13 అంటే ఇష్టం ఉన్నవారు ఇపుడు కొనటం చాలా మంచిది. Amazon సేల్‌లో Apple iPhone 13ని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. iPhone 13 బేస్ వేరియంట్ (128GB) ధర రూ.45,999గా ఉంది. దీని పై బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఒకవేళ మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే మీరు iPhone 13ని కొనుగోలు చేస్తే.. దానిపై రూ. 2,250 ప్రత్యేక తగ్గింపును పొందుతారు మరియు EMI లావాదేవీలపై మీరు రూ. 3,500 వరకు తక్షణ తగ్గింపును పొందుతారు.
ఐఫోన్ 13 లాంచ్ అయి దాదాపు రెండు సంవత్సరాల కాలం అయింది. అయినా ఐ ఫోన్ 13 క్రేజ్ మాత్రం మార్కెట్లో తగ్గట్లే. ఒకవేళ ఐ ఫోన్ ని గనుక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొంటే మాత్రం.. మీకు అద్భుతమైం డీల్ మీ సొంతం అవుతుంది. అంత చవకగా ఇది లభించనుంది. ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 మధ్య పెద్ద తేడాలు లేనందున ఇది ఐఫోన్ 14 కంటే సరసమైన ఎంపిక.
Also Read: Poco F5 Pro Price: బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో POCO F5 5G మొబైల్‌పై రూ. 15,050 తగ్గింపు, త్వరపడండి..
నిజానికి iPhone 13లో iPhone 14లో ఉన్న అన్ని ఇతర ఫీచర్లు ఉన్నాయి, కానీ ఐఫోన్ 13 కంటే ఐఫోన్ 14 కొంచెం మెరుగైన బ్యాటరీ కలిగి ఉంది. ఇది తప్పితే ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14తో సరిసమానం అని చెప్పవచ్చు.
ఐఫోన్ 13 ఫీచర్లు..
డిస్‌ప్లే - ఐఫోన్ 13లో 6.1 అంగుళాల స్క్రీన్.. సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది.
బరువు- ఐఫోన్ 13 బరువు 174 గ్రాములు.
ప్రాసెసర్ - ఐఫోన్ 13లో A 15 చిప్‌ని కలిగి ఉంది.
కెమెరా- ఐఫోన్ 13లో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. 12 MP మెయిన్ బ్యాక్ కెమెరా, 12 MP ఉన్నాయి
రెండవ అల్ట్రా వైడ్ కెమెరా ఫ్లాష్ లైట్‌తో అందించబడింది. కానీ ఐ ఫోన్‌లో 12 MP ఫ్రంట్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉంది.
స్టోరేజ్ - iPhone 13 128 GB, 256 GB మరియు 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
నెట్‌వర్క్- ఇది 5G ఫోన్.
బ్యాటరీ- iPhone 13 యొక్క బ్యాటరీ 19 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
Also Read: YSRTP vs Congress: కాంగ్రెస్‌లో విలీనానికి తెర, ఇక ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల బరిలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook