Amazon Prime Day Sale Offers: ప్రీమియం ఫీచర్లతో 10 వేలకంటే తక్కువకే 5 స్మార్ట్ ఫోన్లు, ఆఫర్ కొద్ది గంటలే
Amazon Prime Day Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు రెండూ ఒకదానికొకటి పోటీగా డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాయి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్, ఆమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. వివిధ రకాల స్మార్ట్ ఫోన్ల పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అందుకే త్వరపడండి.
Amazon Prime Day Sale Offers: ఓవైపు ఫ్లిప్ కార్డ్ గోట్ సేల్, మరోవైపు అమెజాన్ ప్రేమ్ డే సేల్ పోటా పోటీగా ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచన ఉన్నా లేదా ఇంకేమైనా కొనాలన్నా ఇదే మంచి అవకాశం. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు 10 వేలలోపే లభిస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులతో పాటు స్మార్ట్ ఫోన్ల పై సైతం ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. కళ్లు చెదరే డిస్కౌంట్ ఆఫర్లతో అత్యంత చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇవాళ, రేపు అంటే జూలై 20, 21 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి కొద్ది గంటలే మిగిలింది. 10 వేల లోపు ధరకు లభించే ప్రీమియం ఫీచర్లు కలిగిన 5 స్మార్ట్ ఫోన్ల వివరాలు మీ కోసం..
Redmi 13C 5G
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ ఫోన్ పై ప్రత్యేకంగా 1000 రూపాయల డిస్కౌంట్ నడుస్తోంది. దాంతో ఈ ఫోన్ కేవలం 9,499 రూపాయలకే లభించనుంది. రెడ్ మి 13 స 5జిలో మీడియా టెక్ డైమెన్సిటీ 610 ప్లస్ చిప్ సెట్ ప్రాసెసర్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమేరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమేరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ లేదా వీడియో కెమేరా ఉన్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Lava Blaze 5G
లావా కంపెనీకు చెందిన బేసిక్ వేరియంట్ ఇది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ ప్రొసెసర్ ఉంది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమేరా విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే 5000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంది. ఈ ఫోన్ ప్రత్యేక డిస్కౌంట్ అనంతరం కేవలం 8,999 రూపాయలకే లభించనుంది.
Poco M6 pro 5G
అమెజాన్ లో చౌక ధరకు లభిస్తున్న మరో ప్రీమియం ఫీచర్లు కలిగిన ఫోన్ ఇది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగా పిక్సెల్ డ్యూయల్ ప్రైమరీ కెమేరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. ఈ ఫోన్ డిస్కౌంట్ అనంతరం కేవలం 9,998 రూపాయలకే లభిస్తోంది.
Nokia G42 5G
నోకియా నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ప్రొసెసర్ కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరా, 2 మెగా పిక్సెల్ మ్యక్రో లెన్స్ ఇలా త్రిబుల్ కెమేరా సెటప్ ఉంది.సెల్ఫీలేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ కెమేరా అమర్చారు. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్కౌంట్ తరువాత 9,499 రూపాయలకు లభిస్తోంది.
iQoo Z9 lIte
ఐక్యూ కంపెనీ లాంచ్ చేసిన ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ ప్రొసెసర్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ రేర్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
Also read: Long Weekend Dates: ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది, ఎక్కడికెళ్లాలో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook