Amazon Smartphone upgrade Days: అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కొంట్లు లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు ఇదే మంచి అవకాశం. అమెజాన్ ఆఫర్ల వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌పై చాలా రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. OnePlus, Xiaomi, Samsung, iQOO, Realme, Oppo, Tecno వంటి బ్రాండెడ్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. 


అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ ఇప్పుడు ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 వరకూ ఉంటుంది. అంటే మరో రెండ్రోజులు మాత్రమే మిగిలుంది. డీల్స్, ఆఫర్లతో పాటు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అమెజాన్ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. 


ఈ సేల్‌లో OnePlus Nord CE2 light 5G, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లు 18,999 రూపాయలు, 49, 999 రూపాయలకు లభిస్తున్నాయి. ఇందులో 3,6,9 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యముంది. 1250 రూపాయల వరకూ బ్యాంకులు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నాయి. ఇక Realme Narzo 50A స్మార్ట్‌ఫోన్ 10,999 రూపాయలకే అందుతోంది. ఇందులో 5000 వరకూ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హేలియో జీ85 గేమింగ్ ప్రోసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 


Samsung ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం32, శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్లు 12,499 రూపాయలు, 11,999 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1500 వరకూ క్యాష్‌బ్యాక్ ఉంది. ఇక iQoo స్మార్ట్‌ఫోన్‌పై కూడా మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఐక్యూ జెడ్ 6 44 వాట్స్ 14,499 రూపాయలకు లభిస్తోంది. ఇందులో కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుపై 1250 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఐక్యూ నియో 6 5జి ధర 29,990కు లభిస్తుంది. 


Also read: Multibagger Stocks: లక్ష రూపాయలను 28 కోట్లు చేసిన స్టాక్ ఇది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook