Iphone 14 Vs Iphone 15: ఐఫోన్ 15 సిరీస్‌లో వచ్చిన బిగ్ అప్‌గ్రేడ్స్ ఇవే..ఈ ఫీచర్స్ Iphone 14లో కూడా ఉన్నాయా?
Apple Iphone 14 Vs Apple Iphone 15 Comparison: యాపిల్ తన వండర్ స్ట్ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌లకు సంబంధించిన స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ మొబైల్స్ ఎన్నో రకా కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Iphone 14 Vs Apple Iphone 15 Comparison: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ బ్రాండ్ యాపిల్ తన వండర్ స్ట్ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 15 లైనప్ మొబైల్ ఫోన్స్ ను విడుదల చేసింది. కంపెనీ ఈ మొబైల్ ను అతి శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు అనేక రకాల కొత్త ఫీచర్లతో ఆవిష్కరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్మార్ట్ ఫోన్లు ఐఫోన్ 14 మోడల్స్‌కి అప్గ్రేడ్లుగా వచ్చాయి. యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం ఐఫోన్ 15 సిరీస్ ను మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ అన్ని వేరియంట్లను టైప్ సిప్ సి USB పోర్టుతోపాటు డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల చేసింది. అంతేకాకుండా మరెన్నో కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
యాపిల్ కంపెనీ ఐఫోన్ 15, ఐఫోన్ 15 Plus, ఐఫోన్ 15 Pro, ఐఫోన్ 15 Pro Max మొబైల్స్ అధునాతన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఇక ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే..ఇప్పటివరకు యాపిల్ ప్రో కస్టమర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉండే యాపిల్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను ఇప్పుడు కంపెనీ ఐఫోన్ 15లో అన్ని వేరియంట్స్ మొబైల్స్‌పై అందిస్తోంది. అయితే యాపిల్ 14 సిరీస్‌లో కేవలం ఈ ఫీచర్ ప్లస్ వేరియంట్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అంతేకాకుండా ఈ ఐఫోన్ 15 సిరీస్‌లో డిస్ప్లేలో ముఖ్యమైన మార్పును తీసుకువచ్చింది. ఇంతక ముందు ఉన్న Apple Super Ratina XDR OLED డిస్ప్లే నుంచి నాచ్ని తొలగించి కొత్త రకంతో అందించింది. అయితే ఈ డిస్ప్లే గరిష్ట 2000నిట్ల వరకు బ్రెట్‌నేస్‌ను కలిగి ఉంటుందని యాపిల్ పేర్కొంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
ఐఫోన్ 15 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండమే కాకుండా..ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్‌లో వెనుక ప్యానెల్లో అల్యూమినియం డిజైన్ కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ ఫీచర్‌తో వస్తుంది. యాపిల్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్స్‌ను 5 కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ iPhone 15, iPhone 15 Plus 48MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కెమెరా క్వాడ్ పిక్సెల్ ఇమేజింగ్కు సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ స్మార్ట్ ఫోన్స్‌లో బ్యాక్ సెటప్‌లో మొత్త మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో ప్రధాన కెమెరా 48MP కలిగి ఉంటే..మిగిత రెండు మాత్రం 12MPతో వస్తాయి. ఇందులో ఒక కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా సిస్టమ్ 2X జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ జూమ్ సామర్థ్యంతో వీడియోలను 4K సినిమాటిక్ మోడ్‌లో రికార్డ్ చేసుకుని ఆప్షన్ కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ను వినియోగించేవారు ఇకపై విడిగా పోర్ట్రెయిట్ మోడ్‌కి మారాల్సిన అవసరం లేకుండా మెషిన్ లెర్నింగ్తో ఫోకస్, డెప్త్ కంట్రోల్ అనే ఫీచర్స్‌ను అందిస్తోంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.