Apple iPhone 15 Pro Max will come with 48mp sony camera: 'యాపిల్' కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక  యాపిల్ కంపెనీ ఈ ఏడాది ఐఫోన్‌ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. టెక్‌ వర్గాల్లో ఎప్పటినుంచో ఐఫోన్‌ 15 సిరీస్‌ గురించి చర్చ ప్రారంభమైంది. ఈ సిరీస్‌ మోడల్స్‌లో కీలక మార్పులు ఉంటాయని యాపిల్‌ పాపులర్ టిప్‌స్టర్‌లు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొత్త మోడల్స్‌పై ఇప్పటికే ఉత్కంఠ మొదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత సంవత్సరం యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ మరియు కెమెరా ఫీచర్‌లతో గణనీయమైన మార్పులను చేసింది. ఈ సంవత్సరం కూడా ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఐఫోన్‌ 15 సిరీస్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఐఫోన్ పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని, ఇది ఎక్కువ ఆప్టికల్ జూమ్‌ చేస్తుందని కొంతకాలం క్రితం పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max) 48MP సోనీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందున్న దాని కంటే పెద్ద సెన్సార్ పరిమాణంతో రానుందని ఓ నివేదిక వెల్లడించింది.


ఐఫోన్ అన్ని మోడల్‌లు ఎల్లప్పుడూ తమ కెమెరా పనితీరుతో వినియోగదారులను మంత్రముగ్ధులను చేస్తోంది. అయిన్నప్పటికీ పలు  సాంకేతిక లక్షణాల పరంగా అవి ఎప్పుడూ ఉత్తమమైనవి కావు. ఆవిష్కరణ కంటే.. స్థిరమైన పనితీరు కోసం యాపిల్ స్థిరమైన ప్రాధాన్యతను కలిగి ఉండడమే కారణం. వినియోగదారుల కోసం కొత్త టెక్నాలజీని కూడా తీసుకొస్తుందట. ఇటీవలి పుకార్లు నిజమైతే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అద్భుత ఫీచర్లను కలిగి ఉంటుంది. 


యాపిల్ కంపెనీ చాలా కాలంగా తన ఫోన్‌లను రెండు విభిన్న సిరీస్‌లుగా (ప్రామాణిక మరియు ప్రో మోడల్‌లు) విభజించింది. ఈ సిరీస్‌ ఫోన్‌లు చాలా అంశాలలో సారూప్యంగా ఉంటాయి. కెమెరా మరియు ర్యామ్ వంటివి మాత్రమే విభిన్నంగా ఉంటాయి. అయితే కంపెనీ 14 సిరీస్ ప్రాసెసర్‌లో తేడాను తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌లు వాటి కెమెరా లక్షణాలలో విభిన్నంగా ఉంటాయి. దాంతో ఉత్తమ పనితీరును కోరుకునే వారు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ని ఎంచుకోవచ్చు. 


Also Read: Vivo Y78 Plus 5G Launch: కళ్లు మిరుమిట్లు గొలిపే 5G ఫోన్.. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో! డిజైన్‌, ఫీచర్స్ అదుర్స్  


Also Read: Samantha Beauty Care : కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లు రాకుండా సమంత కష్టాలు.. ఫోటో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.