Apple iPhone 16 Series: ఐఫోన్ 16 లాంచింగ్ అదుర్స్ ..సరికొత్త ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇవే
Apple iPhone 16: ఐఫోన్ లవర్స్ కు పండగలాంటి వార్త. ఇన్నాళ్లపాటు కొనసాగిన నిరీక్షణ ముగిసింది. యాపిల్ ఎట్టకేలకు కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ తోపాటు ఇతర ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ లో జరుగుతున్న యాపిల్ ఈవెంట్ లో ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫఓన్ 16 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్ 10 సిరీస్, ఎయిర్ పాడ్స్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ18 చిప్ ను కంపెనీ పరిచయం చేసింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Apple iPhone 16 launch: ఎట్టకేలకు ఆపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ఈసారి కూడా కంపెనీ మొత్తం నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన “ఇట్స్ గ్లోటైమ్” ఈవెంట్‌లో, కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కొత్త శ్రేణి ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను కూడా పరిచయం చేసింది. ముందుగా iPhone 16, 16 Plus ధర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కంపెనీ ఈసారి ఈ రెండు డివైజులలో కొత్తగా ఎలాంటి అప్ డేట్స్ ఇచ్చింది. మునుపటి మోడళ్ల కంటే అవి మెరుగ్గా ఉన్నాయో లేదో తెలుసుకుందాం.
యాపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు:
iPhone 16 మోడల్‌లు అనేక అప్‌గ్రేడ్‌లను పొందాయి. మునుపటి మోడళ్లతో పోల్చితే ఐఫోన్ 16 ప్రో వెర్షన్ కూడా తాజా అప్ డేట్ తో వచ్చింది. ఈసారి ప్రో మోడల్లో వినియోగదారులు మునుపటి కంటే పెద్ద డిస్ ప్లేను పొందబోతున్నారు. ఐఫోన్ 16 సిరీస్ త్వరలో ప్రీ-ఆర్డర్‌కు వెళ్లనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆపిల్ స్టోర్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐఫోన్ 16 ప్రారంభ ధర $799 (రూ. 79,900)తో వస్తుంది. అయితే ఐఫోన్ 16 ప్లస్ ధర $899 (రూ. 89,900). ఈ ధరలు US మార్కెట్‌కి సంబంధించినవి.అయితే భారత్ లో ధర వివరాలను ఆపిల్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లను ఆవిష్కరించింది. "ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం"తో డిజైన్ చేసింది. సరికొత్త కలర్ లో ఆకట్టుకునే విధంగా -ఇన్ఫ్యూజ్డ్ బ్యాక్‌గ్లాస్‌తో వచ్చింది. డివైజులు అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో వస్తాయి. ఐఫోన్ 16 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఐఫోన్ 16 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల బిగ్ స్క్రీన్‌ను అందిస్తుంది.
రెండు మోడల్‌లు 2000నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి. చీకటి ప్రదేశంలోనూ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇది ఐఫోన్ 15కి శక్తినిచ్చే A16 బయోనిక్ చిప్ కంటే 30 శాతం స్పీడ్ గా ఉంటుంది. అయితే 30 శాతం తక్కువ పవర్ ను ఉపయోగిస్తుంది. ఫోటో, వీడియోగ్రఫీ కోరుకునే వారికి డీఎస్ఎల్ ఆర్ కెమెరాకు మించిన క్లారిటీ ఉంటుంది.
ఐఫోన్ 16 పెద్ద ఫోటోలను తీయడానికి 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను ఉపయోగిస్తుంది. అంతేకాదు ఈ ఫోన్ ఐఫోన్ 15లో ఉన్న 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నిలువు కెమెరా లేఅవుట్ కోరుకునే కస్టమర్లు హ్యాండ్‌సెట్‌ని ఉపయోగించి ఎంత దూరంలో ఉన్న వాటినైనా క్యాప్చర్ చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter