Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ ఆఫర్లు, ఐఫోన్ కొంటే ఎయిర్‌పాడ్స్ ఉచితం
Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ కంపెనీ..ఐఫోన్ ప్రత్యేక సేల్ ప్రారంభిస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితంగా లభించనున్నాయి. సేల్ ఎప్పుడు ప్రారభమౌతుంది, ఇతర వివరాలు మీ కోసం..
Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ కంపెనీ..ఐఫోన్ ప్రత్యేక సేల్ ప్రారంభిస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితంగా లభించనున్నాయి. సేల్ ఎప్పుడు ప్రారభమౌతుంది, ఇతర వివరాలు మీ కోసం..
ప్రముఖ ఈ కామర్స్ వేదికలతో పాటు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు కూడా ఫెస్టివల్ సీజన్ ప్రారంభించాయి. ఇప్పుడు యాపిల్ సైతం ఫెస్టివల్ సీజన్ ప్రకటించింది. యాపిల్ ఇండియా స్టోర్‌లో ప్రచురితమైన టీజర్ ప్రకారం..కంపెనీ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభిస్తోంది. ఈ సేల్ ఆఫర్ల గురించి ఇంకా స్పష్టత లేదు. కానీ ఐఫోన్ కొనుగోలుపై ఉచిత బహుమతులున్నాయని తెలుస్తోంది.
గత ఏడాది ఫెస్టివ్ ఆఫర్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా అందించింది కంపెనీ. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్లతో గత ఏడాది ఎయిర్‌పాడ్స్ ఉచితంగా అందించింది. ఈసారి ఐఫోన్ 13తో ఇయర్‌పాడ్స్ ఉచితంగా అందించవచ్చని తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఐఫోన్‌పై డిస్కౌంట్
యాపిల్ ఐఫోన్ 13.. 2021లో 79,900 రూపాయలకు లాంచ్ అయింది. ఈ నెలలో ఐఫోన్ 14 లాంచ్ సందర్భంగా ఐఫోన్ 13 ధరను 69,900 కు తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ , అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 57,990 రూపాయలకు లభ్యం కానుంది. పాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ పై 16,900 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది.
అదే విధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 12..42, 999 రూపాయలకు లభిస్తోంది. ఇది కాకుండా 3 వేల బోనస్ ఎస్బీఐ కస్టమర్లకు వర్తిస్తుంది. ఫలితంగా ఐఫోన్ 12 ధర 39,999 రూపాయలకు చేరుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటి సేల్ సెప్టెంబర్ 23 న ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 వరకూ ఉంటుంది.
Also read: ICICI Credit Card Alert: ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కి ముఖ్యమైన అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook