Best 5 Phones In India: 2022లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి విడుదలైయ్యాయి. అయితే ఇందులో చాలా ఫోన్లు వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నాయి. ముఖ్యంగా ఆపిల్, శాంసంగ్ వంటి కంపెనీలకు చెందిన ఫోన్లు ఈ కామర్స్‌  వెబ్‌ సైట్‌లో విచ్చలవిడిగా అమ్ముడుపోయాయి. ఇవేకాకుండా Xiaomi, OnePlus, iQOO వంటి బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్లు కూడా చాలా వరకు సేల్‌ అయ్యాయి. ఈ సంవత్సరం ఎక్కువగా తక్కువ ధరలకే ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌ లభించడంతో చాలా మంది కొనుగోలు చేశారు. వీటి రేట్లు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు ఉండడంతో సేలింగ్‌ బాగా జరిగింది. అయితే ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరలకే లభించిన ఫోన్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆపిల్ ఐఫోన్ 14:
ఆపిల్ ఐఫోన్ 14 వెంటనే మార్కెట్‌ ఒక్క సారిగా షేక్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా  ప్రజాదరణ పొందింది ఆపిల్ ఐఫోన్ 14. అయితే ప్రస్తుతం ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అయిన ఫ్లిప్‌ కార్ట్‌లో రూ.78,740కి లభిస్తోంది. అయితే భారీ డిస్కౌంట్‌ పొందాలనుకునేవారు తప్పకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.


Google Pixel 7:
అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో Google Pixel 7 ఒక్కటి. ఈ ఫోన్‌ అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టలో దీని ధర రూ. 59,999 కాగా.. క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరలకే పొందవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే..6.3-అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కి 50MP + 12MP డ్యూయల్ కెమెరా అందుబాటులో ఉంది.


OnePlus 10T 5G:
ఈ కామర్స్‌ వెబ్‌ సైట్లలో ఎక్కువగా అమ్ముడు పోయిన ఫోన్లలో OnePlus 10T 5G కూడా ఒక్కటి. ఈ ఫోన్‌ నూతన ఫీచర్లతో వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది. OnePlus 10T 5G ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 50MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దీని ధర  ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 54,999కి అందుబాటులో ఉంది.


Xiaomi 12 Pro:
ఎప్పటి నుంచో Xiaomiకి మంచి ప్రజాదారణ ఉంది. ఈ ఫోన్స్‌ ఎక్కువగా బడ్జెట్‌ ధరల్లో మార్కెట్‌లో లాంచ్ అవుతాయి. అయితే ఇటివలే విడుదలై Xiaomi 12 Pro కూడా మార్కెట్‌లో మంచి పేరు సంపాదించింది. అమెజాన్‌లో రూ. 55,999లకే వినియోగదారులకు లభింస్తోంది.


iQOO 9T:
Amazonలో iQOO 9T 5G చాలా బాగా సేల్‌ అయ్యింది. ఇది 8+ Gen 1 స్నాప్‌డ్రాగన్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌ 120W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో వస్తోంది. iQOO 9Tకి 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.


Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు 


Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook