Best Affordable Mobiles: అమెజాన్‌లో 50MP కెమెరా కలిగిన మొబైల్ రూ.7,000 లోపే..పరిమిత కాలం డిస్కౌంట్ ఆఫర్స్!
Best Affordable Smartphones 2023: అతి తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో 50MP కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్ డెడ్ ఛీప్‌గా లభిస్తున్నాయి.
Best Affordable Smartphones 2023: అతి తక్కువ ధరల్లో 50MP కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?..మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. 50MP కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.10,000 కంటే తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే అతి తక్కువ ధరలో అమెజాన్‌లో లభించే టాప్ 3 స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
POCO C55 (4GB RAM + 64GB స్టోరేజ్):
POCO కంపెనీ సాధరన వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని C55 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా పాటు 10W ఛార్జ్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్‌తో రాబోతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ రూ.8,443కే విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB, 6GBRAM + 64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ POCO C55 మొబైల్ HD+ రిజల్యూషన్‌తో 6.71-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.
Realme C33 (3GB RAM + 32GB స్టోరేజ్):
Realme బ్రాండ్ కూడా ఇటీవలే ఈ C33 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 8,936కు విక్రయిస్తోంది. ఈ Realme C33 మొబైల్ 50MP ప్రైమరీ కెమెరా Unisoc T612 SoC ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే విషయానికొస్తే..HD+ రిజల్యూషన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
Infinix HOT 30i (4 GB RAM + 64 GB స్టోరేజ్):
అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్లు అతి తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్స్‌లో Infinix HOT 30i కూడా ఒకటి..ఈ స్మార్ట్ ఫోన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది అతి తక్కువ ధరలో లభించడంతో చాలా మంది సాధరణ కస్టమర్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ అమెజాన్‌లో Infinix HOT 30i స్మార్ట్‌ఫోన్ రూ. 7,999కే లభిస్తోంది. ఈ మొబైల్ ఫోన్ MediaTek Helio G37 SoC చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా 5,000mAh బ్యాటరీ, USB టైప్-C పోర్ట్‌తో మార్కెట్‌లో లభిస్తోంది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook