New 5G Smartphones SAMSUNG: శాంసంగ్ నుంచి 2 సూపర్ స్మార్ట్ఫోన్లు.. ఇక వన్‌ప్లస్‌కి టాటా చెప్పాల్సిందే!
Samsung Galaxy A54 Price: శాంసంగ్ కంపెనీ భారతదేశంలో రెండు A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను (Samsung Galaxy A54 and Samsung Galaxy A34) విడుదల చేసింది.
Samsung Launch Samsung Galaxy A54 & Samsung Galaxy A34 in India: సౌత్ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ 'శాంసంగ్'కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు నూతన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే శాంసంగ్ కంపెనీ భారతదేశంలో రెండు A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్త అరంగేట్రం తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఏ34 (Samsung Galaxy A34) మరియు శాంసంగ్ గెలాక్సీ ఏ54 (Samsung Galaxy A54)లను భారతదేశంలో రిలీజ్ చేసింది. గత సంవత్సరం వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ53 (Samsung Galaxy A53) మరియు శాంసంగ్ గెలాక్సీ ఏ33 (Samsung Galaxy A33) కొనసాగింపుగా వచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 (Samsung Galaxy A34) మరియు శాంసంగ్ గెలాక్సీ ఏ54 (Samsung Galaxy A54) ఫోన్‌లు నీరు మరియు ధూళిని తట్టుకోగలవు. ఈ రెండు IP67 రేటింగ్ పొందాయి. ఇది కాకుండా AMOLED డిస్ప్లే మరియు అనేక అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌ల ధర సహా మరిన్ని వివరాలుఇప్పుడు చూద్దాం.
Samsung Galaxy A54 ధర:
8GB / 128GB వేరియంట్ ధర రూ. 38,999
8GB / 256GB వేరియంట్ ధర రూ. 40,999
Samsung Galaxy A34 ధర:
6GB / 128GB వేరియంట్ ధర రూ. 30,999
8GB / 256GB వేరియంట్ ధర రూ. 32,999
Samsung Galaxy A54 and Galaxy A34 ఆఫర్స్:
శాంసంగ్ గెలాక్సీ ఏ34, శాంసంగ్ గెలాక్సీ ఏ54 ఫోన్‌లలోనూ రూ. 3,000 క్యాష్‌బ్యాక్ లేదా శాంసంగ్ అప్‌గ్రేడ్ పొందడంపై రూ. 2,500 తగ్గింపు ఉంటుంది. వినియోగదారులు మార్చి 16 నుంచి మార్చి 27 వరకు ఈ ఫోన్‌ల ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్:
శాంసంగ్ గెలాక్సీ ఏ54 ఫోన్ Exynos 1380 SoC ద్వారా ఆధారితమైనది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల FHD + sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5MP డెప్త్ యూనిట్ అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy A34 స్పెసిఫికేషన్స్:
శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్ MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా ఆధారితమైనది. ఈ ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD + sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 13MP స్నాపర్ మరియు వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
Also Read: Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ 100 కాదు.. 110 సెంచరీలు చేస్తాడు! షోయబ్ అక్తర్ జోస్యం
Also Read: Top SUVs Under 10 Lakhs: 10 లక్షల లోపు టాప్ ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజ్జాతో సహా థార్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.