COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Laptops Under 20,000: ప్రీమియం రేంజ్‌ ల్యాప్‌ట్యాప్‌లకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీలు కూడా ప్రీమియం ఫీచర్స్‌తో ల్యాప్‌ట్యాప్‌లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే ఇటీవలే సాంసంగ్‌ విడుదల చేసిన ల్యాప్‌ట్యాప్‌కి మార్కెట్‌లోకి మంచి పేరు లభించింది. ఇది బడ్జెట్‌లో లభించడంతో యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఎప్పటి నుంచో మంచి ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా మీ కోసం ప్రత్యేక తగ్గింపుతో సాంసంగ్ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన Galaxy Book 2 ల్యాప్‌ట్యాప్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ ల్యాప్‌ట్యాప్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అతి చౌకగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ల్యాప్‌ట్యాప్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా 8 GB ర్యామ్‌ 512 GB ఇంటర్నల్‌ ఎస్‌ఎస్‌డి కలిగిన SAMSUNG Galaxy Book 2 Intel Core i5 12th Gen ల్యాప్‌ట్యాప్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర MRP రూ. 82,990 కాగా ఈ సేల్‌లో భాగంగా 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.44,990కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే దాదాపు భారీ తగ్గింపుతో పొందవచ్చు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఈ SAMSUNG Galaxy Book 2 Intel Core i5 ల్యాప్‌ట్యాప్‌ను Citi-branded బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Canara Bank, Bank of Baroda, HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కూడా దాదాపు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక రిపబ్లిక్‌ డే సందర్భంగా వన్‌ కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ ల్యాప్‌ట్యాప్‌ను కేవలం రూ.42,990కే పొందవచ్చు. 


దీంతో పాటు ల్యాప్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందుతారు. అయితే దీని కోసం మీ పాత ల్యాప్‌ట్యాప్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.28,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్ పోను ఈ ల్యాప్‌ కేవలం రూ.14,990కే పొందవచ్చు.  


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter