COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Phone Under 15000: అతి తక్కువ ధరలోనే  శక్తివంతమైన కెమెరా కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?..మీ కోసం ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌, అమెజాన్‌..ఈ డీల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌కు సంబంధించిన ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తున్నాయి. ఈ డీల్‌లో 50MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ రూ.15,000లోపే పొందవచ్చు. ఏయే స్మార్ట్ ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు:
Redmi 12 5G:

Xiaomi Redmi స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. రెడ్ మీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన Redmi 12 5G స్మార్ట్‌ ఫోన్‌  50MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ప్రత్యేక డీల్స్‌లో భాగంగా రూ.11,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ ఫోన్‌ 6.79 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  


Moto G54:
Motorola ఇటీవలే విడుదల చేసిన Moto G54 స్మార్ట్‌ ఫోన్‌  MediaTek Dimensity 7020 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్‌ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ Moto G54 స్మార్ట్‌ ఫోన్‌ 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ 6000mAh బ్యాటరీ, 120Hz 6.5 అంగుళాల డిస్‌ప్లేతో రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.13,999కే లభిస్తోంది. 


Samsung Galaxy M14 5G:
ప్రస్తుతం అన్ని ఈ కమర్స్‌ కంపెనీల్లో Samsung Galaxy M14 5G స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ను అతి చౌకగా రూ.12,990కే కొనుగోలు చేయోచ్చు. ఇక ఫీచర్స్‌ విషయానికొస్తే..ఈ స్మార్ట్‌ ఫోన్‌  50MP ప్రైమరీ బ్యాక్‌ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ 6.6 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, Exynos 1330 ప్రాసెసర్‌తో లభిస్తోంది. 


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook