COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Smart Tv Released In 2023: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ టీవీల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి రావడం వల్ల వినియోగదారులంతా స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ కంపెనీలు స్మార్ట్ టీవీల తయారీని ప్రారంభించాయి. ముఖ్యంగా రెడ్ మీ లాంటి చాలా కంపెనీలు ప్రస్తుతం మార్కెట్లోకి టీవీలను విడుదల చేశాయి. అయితే ఇటీవలే రెడ్మీ నుంచి మరో స్మార్ట్ టీవీ మార్కెట్లోకి విడుదలైంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో పాటు ఇంతకుముందు ఎప్పుడు చూడని భారీ స్క్రీన్ తో మార్కెట్లోని కస్టమర్లకు లభిస్తోంది. 


ప్రముఖ చైనీస్ కంపెనీ రెడ్మీ తమ కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి మరో స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. ఈటీవీ ప్రస్తుతం చైనాలో రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో మొదటి వేరియంట్ 55-అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంటే రెండవది 70 అంగుళాల సైజుతో కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు A సిరీస్ అనే నామకరణం తో కంపెనీ చైనా మార్కెట్లోకి వదిలింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో లభిస్తున్న A55, A70 రెడ్మీ స్మార్ట్ టీవీలు 60Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్‌తో ప్యానెల్‌లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  


ధరల వివరాలు:
ప్రముఖ టెక్నిక్ ను తెలిపిన వివరాల ప్రకారం..A55, A70 రెడ్మీ స్మార్ట్ టీవీలు రూ.22,900 ప్రారంభమవుతాయని సిరీస్ ని బట్టి రేట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని సిరీస్లో ఫీచర్లను బట్టి రేట్లను కూడా కంపెనీ అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపారు. అయితే భారతదేశంలో మాత్రం రూ. 3000 నుంచి రూ. 5000 వరకు పెంచి విక్రయించే అవకాశాలు ఉన్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో ఈ స్మార్ట్ టీవీల విడుదల విషయానికొస్తే.. కంపెనీ ఇప్పటివరకు భారత్ లో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మున్ముందు చేసే అవకాశాలు ఉన్నట్లు టెక్నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి