POCO To Release POCO C55 SmartPhone on 2023 February 28: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ 'పోకో'కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పోకో ఎప్పటికపుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పోకో తన విజయవంతమైన సి-సిరీస్‌లో సీ55 (Poco C55) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ.10 వేల కన్నా తక్కువ ధరలో 50 ఎంపీ కెమెరా, ఫాస్ట్‌ఛార్జింగ్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగులలో (ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ మరియు పవర్ బ్లాక్) లభిస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ, 64జీబీ వేరియంట్‌ ధరన రూ .9,499గా ఉండగా.. 6జీబీ, 128 జీబీ వేరియంట్‌ ధర రూ.1 0,999గా ఉంది. 2023 ఫిబ్రవరి 28 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో పోకో సీ55 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. పోకో వెబ్‌సైట్లలో కూడా ఫిబ్రవరి 28 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.


హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్‌ కలుపుకొంటే తొలిరోజు ఈ ఫోన్లు వెయ్యి రూపాయలు తక్కువకు లభిస్తాయి. ఈ ఫోన్ డ్యూయల్‌ నానో సిమ్‌ ఆప్షన్‌తో వస్తోంది. ఎంఐయూఐ 13తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఇందులో ఉంటుంది. ఇది మొబైల్ గేమర్‌లకు స్థిరమైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ Android 12తో రన్ అవుతుంది. 


పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌ 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌, 60Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఫొటోలు, వీడియోల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సల్‌ కెమెరా ఉంటుంది. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంటుంది. 4జీ, బ్లూటూత్‌ 5.1, మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ52 రేటింగ్‌ ఈ ఫోన్ కలిగి ఉంది.


Also Read: Street Dogs Kills Boy: అంబర్ పేటలో విషాదం.. నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి! తీవ్ర గాయాలతో మృతి  


Also Read: విరాట్ కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చిన యువతి.. సెన్సెషనల్ వీడియో చూడాల్సిందే! పాపం అనుష్క


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.