Smartphones to Buy Under 40000: ప్రస్తుతం టైమ్‌ అన్నం లేకపోయినా ఉండగలరేమోగానీ ఒక్క క్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే తట్టుకోలేరు. మన దేశంలో నిత్యం కొన్ని లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్మడుపోతున్నాయి. అయితే ఏవి కొనాలి..? ఎలాంటి ఫీచర్లు అవసరం అనే అంశాలపై సతమతమవుతూ ఉంటారు వినియోగదారులు. అందుకే రూ.40వేల లోపు అద్భుతమైన స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి వివిధ కంపెనీల మోడల్స్ మీ ముందుకు అందిస్తున్నాము. అందులో మీకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Best Selling Car: మన దేశంలో అమ్మకాల్లో దుమ్ములేపిన కారు.. ఒక్క నెలలోనే భారీగా కొనేశారు..!


వన్ ప్లస్ 12R.. 


వన్ ప్లస్  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 6.7 అంగుళాల AMOLED Pro XDR డిస్ ప్లేతో రూపొందించారు. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ ప్రాసెసర్‌ను సెట్ చేశారు. 16 జీబీ నుంచి 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్‌తో రూపొందించారు. అతిత్వరగా ఛార్జ్ చేసేందుకు 100 సూపర్ వోక్స్ ఛార్జర్‎ను అందిస్తున్నారు. దీంతో 15 నిమిషాల్లో 40 శాతాకినికిపైగా ఛార్జింగ్ చేయవచ్చు. కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సల్ సోనీ ప్రైమరీ కెమెరాను అమర్చారు. 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలు మంచి క్లారిటీ ఇచ్చేలా 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి తీసుకొచ్చారు. 


iQOO నియో 9 ప్రో 


iQOO నియో 9 ప్రో విషయానికి వస్తే.. 6.78 అంగుళాల AMOLED డిస్ ప్లేతో ఉంటుంది. గేమింగ్ ప్రియులకు మంచి అనుభూతిని కలిగించేందుకు 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 2 ప్రాసెస్‌తో  12GB RAM, 256GB ఎక్స్‌టర్నల్ మెమొరీతో తయారు చేశారు. 50MP సోనీ IMX 920 సెన్సార్ ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. అలాగే 5,160 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 120W PD ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్  Android 14 ఆధారంగా Funtouch OS 14 తో నడుస్తుంది. 


నథింగ్ ఫోన్ 2 


నథింగ్ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్ ప్లేతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC మార్కెట్‌లోకి వస్తుంది. 12GB RAM, డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 32 MP కెమెరా ఉంటుంది. 4,700mAh బ్యాటరీ పవర్, 45W వైర్డ్ ఛార్జింగ్ 5W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 


రియల్ మి 12 ప్రో 5G 


రియల్ మి 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల OLED స్క్రీన్‌తో 5G స్మార్ట్ మొబైల్‌గా తయారు చేశారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌ను అమర్చారు. 32MP సోనీ ఫ్రంట్ కెమెరాతో పాటు 50MP సోనీ IMX 890 ప్రైమరీ కెమెరా అందించారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 


రెడ్ మి నోట్ 13 ప్రో+ 5G 


రెడ్ మి నోట్ 13 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. 200MP Samsung ISOCELL HP3 ప్రైమరీ కెమెరా.. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2 MP మాక్రో లెన్స్‌ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం కోసం 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. MediaTek డైమెన్సిటీ 7200-అల్ట్రా చిప్‌ ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీని 120W ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్‌లో అందిస్తున్నారు. 


Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter