Big Billion Day Flipkart: ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో సేల్స్ పేరిట వస్తువులను విక్రయిస్తున్నాయి. ఇక బిగ్ బిలియన్ డేస్ విషయానికొస్తే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్రతి ఏడాది ఈ సేల్స్‌ను నిర్వహిస్తూనే వస్తుంది. ఈ సెల్ లో భాగంగా అందులో లభించే వస్తువులన్నీ తక్కువ ధరకే వినియోదారులకు విక్రయిస్తోంది. ప్రస్తుతం టీవీ, రిఫ్రిజిరేటర్స్, మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ఏసి వంటి ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పై వాటిలో మీరు ఏ వస్తువులను తీసుకున్న భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ సెల్ లో భాగంగా ఏసీల విషయానికొస్తే ఏకంగా 50 డిస్కౌంట్ను ప్రకటించడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఎల్జి ఏసి లపై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. మీరు ఈ సెల్ లో భాగంగా ఎల్జి కి సంబంధించిన ఏసీలను కొనుగోలు చేస్తే ఏకంగా మీరు 50% డిస్కౌంట్ తో ఈ ఏసీ లభించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్జీ 1.5 టన్ ఏసి(LG 1.5 Ton Split AC) విషయానికొస్తే.. ఈమధ్య మార్కెట్లో లాంచ్ అయింది. అంతేకాదు అధికంగా సేల్ అయింది. ప్రస్తుతం ఈ ఏసీ పై 50 నుంచి 52 శాతం దాకా డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఏసీ అసలు ధర రూ. 71,990 కాగా ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా రూ. 35,991 కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఏసీ పై కూడా లభించనున్నాయి. ప్రముఖ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1700 దాకా తగ్గింపుతో ఈ ఏసీ ని పొందవచ్చు.


ఇక ఏసి ఫీచర్ విషయానికొస్తే.. ఫోర్ స్టార్ రేటింగ్ తో మార్కెట్లోకి లాంచ్ అయింది. అంతేకాకుండా యాంటీవైరస్ ప్రొటెక్షన్ కూడా ఏసీలో లభించనుంది. ప్రస్తుతం అన్ని ఏసి లాగే కాపర్ కండెన్సర్ ను ఇందులో వినియోగించారు. కూలింగ్ విషయానికొస్తే ఫ్లిప్కార్ట్ లో ఈ ఏసీ ని కొనుగోలు చేసి వినియోగించిన వినియోగదారులు ఇచ్చిన రేటింగ్ ప్రకారం.. మంచి కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. డిజైనింగ్ అండ్ ఫ్యూచర్స్ విషయానికొస్తే 3.9 రేటింగ్ ఇవ్వగా.. డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్కు 3.6 ఇచ్చారు ఈ ఏసీ ని కొనుగోలు చేసిన వినియోగదారులు. అయితే  ఈ ఏసీ పై ఒక సంవత్సరం బ్రాండింగ్ వారంటీ లభించనంది. అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు గ్యాస్ చార్జింగ్ కూడా చేస్తున్నట్లు ఎల్జి పేర్కొంది.


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok