Boat Airdopes 311 Pro Price: ప్రముఖ టెక్‌ కంపెనీ బోట్(boAt) మార్కెట్‌లోకి కొత్త TWS ఇయర్‌బడ్‌లను లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ boAt Airdopes 311 Pro పేరుతో విడుదలైంది. ఇది ఎంతో ప్రత్యేకమైన డిజైన్‌తో లభిస్తోంది. ఇందులో ప్రత్యేకమైన స్ట్రాంగ్ సౌండ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 50 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఇయర్‌ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ బోట్ బడ్స్‌ను కంపెనీ ధర రూ.1199లతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఇది ధర రూ. 999తో మాత్రమే లభిస్తోంది. అయితే ఈ ఇయర్‌ బడ్స్‌ మొత్తం నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని అన్ని కలర్స్‌ ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ ఇయర్‌ బడ్స్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Amazon Indiaతో పాటు Flipkartలో లభిస్తున్నాయి.  


ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
ఈ boAt Airdopes 311 Pro ఇయర్‌ బడ్స్ ట్రాన్స్‌స్పరెంట్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అలాగే చూడానికి ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు అద్భుతమైన కలర్‌ ఫినిషింగ్‌ కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో 10mm డ్రైవర్లతో అద్భుతమైన బాస్‌ సౌండ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌ బడ్స్‌లో బీస్ట్ మోడ్‌ కూడా లభిస్తోంది. ఈ ఇయర్‌ బడ్స్‌ వేక్ ఎన్ పెయిర్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధునాతన బ్లూటూత్ 5.3 కాలింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అలాగే ఇయర్‌ బడ్స్‌లో Google, Siriని ఒకే టచ్‌తో యాక్సెస్ చేసుకునే ప్రత్యేక ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో క్రికెట్ స్కోర్‌లతో అప్‌డేట్స్‌ వినేందుకు ప్రత్యేక యాక్సెస్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ఉండే బ్యాటరీ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 150 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఈ బడ్‌లు IPX4 రేటింగ్‌ సెటప్‌తో లభిస్తోంది. ప్రస్తుతం రష్, స్పేస్ గ్రే, డస్క్ బ్లూ, యాక్టివ్ బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి