Huge Discounts on Realme 9i: రూ. 18 వేల Realme 9i స్మార్ట్‌ఫోన్ కేవలం 599కే! లిమిటెడ్ ఆఫర్
Buy Realme 9i 5G Just @ Rs 599: 17999 వేల రూపాయల విలువైన రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 599 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.
Get Realme 9i 5G Smartphone Only @Rs 599: ప్రముఖ మొబైల్ తయారీదారు 'రియల్‌మీ'కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మీ 9ఐ 5G (Realme 9i 5G) కూడా ఒకటి. ఈ ఫోన్‌పై ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటివరకు అందించని అతిపెద్ద తగ్గింపును ఇస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. మీకు ఎక్కువ సమయం లేదు. వివరాలు ఇప్పుడు చూద్దాం.
Realme 9i 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో 'రియల్‌మీ 9ఐ 5G' స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 17999. ఈ ధరతో వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. కంపెనీ 16% తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన 16% తగ్గింపు ఆఫర్ తర్వాత.. కస్టమర్‌లు ఈ ఫోన్‌ను రూ. 14999కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ధర కూడా ఎక్కువగా ఉందని భావిస్తున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మరో ఆఫర్ ఉంది.
Realme 9i 5G Exchange Offer: రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ. 14,400గా ఉంది. మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుండి (లేటెస్ట్ మోడల్), ఎలాంటి డామేజ్ ఉండకూడదు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ బోనస్ వర్తిస్తే.. రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 599కే మీ సొంతం అవుతుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది.
Realme 9i 5G Features: రియల్‌మీ 9ఐ 5Gలో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. MediaTek Dimensity 810 ప్రాసెసర్‌ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 1 TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ బ్యాక్ కెమెరా (మొదటి కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, రెండవది 2 మెగాపిక్సెల్‌లు, మూడవది 2 మెగాపిక్సెల్) ఉంటుంది. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉండడంతో మంచి బ్యాకప్‌ను ఇస్తుంది.
Also Read: Brezza Black Edition 2023: మారుతి సుజుకి బ్రెజా 'బ్లాక్' ఎడిషన్ విడుదల.. ధర ఎంతో తెలుసా?
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి