Cheap And Best Neckband Earbuds: తక్కువ ధరలోనే వైర్‌లెస్ ఈయర్ బడ్స్ లభిస్తుండటంతో ఇటీవల కాలంలో వాటి వినియోగం భారీగా పెరిగిపోతోంది. దీంతో నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ మార్కెట్‌ అమ్మకాల పరంగా కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఒక్క 2022 లోనే నెక్‌బ్యాండ్స్ సేల్స్ 9 % పడిపోయాయి. అలాగని దేశంలో నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ మార్కెట్‌ ఇంకా పూర్తిగా తగ్గిపోయింది అని కాదు.. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ఈయర్ ఫోన్స్ యూజర్స్ నెక్‌బ్యాండ్ ఈయర్ ఫోన్స్‌నే తమ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. అందుకు కారణం నెక్‌బ్యాండ్ ఈయర్ ఫోన్స్ ఎక్కువ కాలం వినియోగించడానికి అవకాశం ఉండటంతో పాటు రన్నింగ్, వర్కౌట్, ట్రావెలింగ్ వంటి సందర్భాల్లో ఉపయోగించడానికి వీలుగా, సౌకర్యంగా ఉండటమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడు అవుతున్న నెక్‌బ్యాండ్స్ ఏవి, వాటిని కొనుగోలు విషయంలో కలిసొచ్చే అంశాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోట్ రాకర్స్ 255 ప్రో ప్లస్  పనికొచ్చే విషయాలు
ఇయర్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్, మెటాలిక్ డిజైన్ మరియు IPX7 రేటింగ్‌తో వస్తాయి, ఇది ఇయర్‌బడ్‌లను నీటి-నిరోధకతను కలిగిస్తుంది.


బోట్ రాకర్స్ 255 ప్రో ప్లస్ : ప్రతికూలమైన అంశాలు ఏంటంటే..
ఇందులో నాయిస్ ఐసోలేషన్ ఫీచర్ లేదు. అంతేకాకుండా ఇయర్ టిప్ డిజైన్ కూడా అంత సౌకర్యవంతంగా లేదు.


వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ Z2  నెక్‌బ్యాండ్స్‌లో పనికొచ్చే విషయాలు ఏంటంటే..
వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ Z2 నెక్‌బ్యాండ్స్‌ ఎక్కువ కాలం పాటు బ్యాటరీని ఇవ్వడంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఆర్టిఫిషియల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్ కూడా లభిస్తోంది.


వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ Z2 : కలిసిరాని అంశాలు
వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ Z2 నెక్‌బ్యాండ్స్‌లో లేటెన్సీ మోడ్ లేదు. అలాగే, రెండు ఫోన్లకు పెయిరింగ్ చేసుకునేందుకు అవకాశం లేదు.


రియల్మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో : పనికొచ్చే ఫీచర్స్ ఏంటంటే..
రియల్మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో నెక్‌బ్యాండ్స్‌ వాటర్-రెసిస్టెంట్ ఫీచర్‌తో పాటు లో లేటెన్సీ గేమింగ్ మోడ్ కూడా ఉంది. అలాగే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ లభిస్తుంది.


రియల్మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో నెక్‌బ్యాండ్స్‌లో ఉన్న ప్రతికూలమైన అంశాలు
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియోలో ప్లాస్టిక్ యూనిబాడీ డిజైన్‌తో తయారైంది. బ్లూటూత్ 5.2 ఫీచర్ లేకపోవడం కొంతమేరకు ప్రతికూలమైన అంశంగా యూజర్స్ భావిస్తున్నారు. 


రియల్మీ బడ్స్ వైర్‌లెస్ 2S నెక్‌బ్యాండ్స్‌లో పనికొచ్చే విషయాలపై ఓ లుక్కేద్దాం ( వీటి ధర: రూ. 1,499 మాత్రమే )
రియల్మీ బడ్స్ వైర్‌లెస్ 2S కాల్స్, మాగ్నెటిక్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు AI ENC క్యాన్సిలేషన్‌ కూడా లభిస్తోంది.


రియల్మీ బడ్స్ వైర్‌లెస్ 2S నెక్‌బ్యాండ్స్‌లో మైనస్ పాయింట్ ఏంటంటే.. ఇది ప్లాస్టిక్ బాడీతో తయారవడం. ఇదే ధరలో ఇంకొన్ని వేరే మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Multibagger Stocks: రూ. 65 నుంచి రూ. 560 కి పెరిగిన స్టాక్ ధర


బౌల్ట్ ఆడియో ప్రోబాస్ కర్వ్-X : కేవలం రూ. 999 లభించే ఈ నెక్ బ్యాండ్స్‌లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయంటే.. 
బౌల్ట్ ఆడియో ప్రోబాస్ కర్వ్-X ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, వాటర్-రెసిస్టెంట్ డిజైన్‌‌తో లభిస్తుంది


బౌల్ట్ ఆడియో ప్రోబాస్ కర్వ్-X లో ఉన్న ప్రతికూల అంశాలు ఏంటంటే.. ఇందులో మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ లేవు. అలాగే ఇది కూడా ప్లాస్టిక్‌తో తయారైందే కావడం మన్నికపరంగా మైనస్ పాయింట్ అవుతుంది.


ఇది కూడా చదవండి : Business From Kitchen: 50 ఏళ్ల వయస్సులో కిచెన్ నుంచి బిజినెస్.. నెలకు 20 లక్షల ఆదాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK