Tank 3 Smartphone: మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్లతో కొత్త ఫోన్, 24 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమేరాతో
Tank 3 Smartphone: మార్కెట్‌లో ఒకదాన్ని మించి మరో స్మార్ట్‌ఫోన్ ప్రవేశిస్తోంది. అందుకే స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఫీచర్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అదే విదంగా మార్కెట్‌లో ఇప్పుడు కొత్తగా వస్తున్న మరో చైనా స్మార్ట్‌ఫోన్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
Tank 3 Smartphone: మొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే చైనా ఉత్పత్తులు గణనీయంగా ఉన్నాయి. ఇప్పుడు మరో చైనా కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ ఫీచర్ల ముందు ఏ ఇతర ఫోన్ పనికిరాదు. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
చైనాకు చెందిన యూనిహెర్ట్జ్ కంపెనీ ట్యాంక్ 3 పేరుతో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. 2023 నవంబర్ నెలలోనే మార్కెట్‌లో ప్రవేశించిన ఈ స్మార్ట్‌ఫోన్ గురించి చాలామందికి తెలియదు. తెలిస్తే కొనకుండా ఉండలేరు. స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటి వరకూ మీరు బహుశా గరిష్టంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని చూసి ఉండారు. కానీ 23,800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ద్యం గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా విన్నారా. ట్యాంక్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక ఫీచర్ ఇదే. దీంతోపాటు 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి స్టోరేజ్‌ను 2టీబీ చేసుకోవచ్చు.
యూనిహెర్ట్జ్ కంపెనీ అందిస్తున్న ట్యాంక్ 3 స్మార్ట్‌ఫోన్ 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమేరా మరో ప్రత్యేకత. ప్రైమరీ మెయిన్ కెమేరా ఏకంగా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇదొక ట్రిపుల్ కెమేరా సెటప్. ఇందులో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యూనిట్, 64 మెగాపిక్సెల్ నైట్ విజన్ షూటర్ ఉన్నాయి.
ఇతర స్మార్ట్‌ఫోన్లలో ఉన్నట్టు ఇందులో సాధారణ బ్యాటరీ ఉండదు. ఏకంగా 23,800 ఎంఏహెచ్ సామర్ద్యం కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రపంచంలో ఇంత సామర్ద్యం కలిగిన బ్యాటరీ ఫోన్ మరెక్కడా లేదు. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే 75 రోజుల వరకూ ఛార్జింగ్ అవసరం లేదు. 1800 గంటలు పనిచేస్తుంది. 118 గంటలు కాల్ టైమ్, 98 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ టైమ్, 48 గంటల వీడియో టైమ్, 38 గంటల గేమింగ్ టైమ్ ఉంటాయి. ఇక 120 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల 90 నిమిషాల్లో దాదాపు ఛార్జింగ్ పూర్తవుతుంది.
ఈ ఫోన్‌లో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. 40 మీటర్ల లేజర్ రేంజ్ ఫైండర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, సైడ్ బటన్, ఫింగర్ సెన్సార్ ఉన్నాయి. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా స్పష్టత లేదు. చైనా మార్కెట్‌లో ఈ ఫోన్ ధర 41 వేలుగా ఉంది.
Also read: Post Office Schemes: 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే 9 లక్షలు ఆదాయం, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook