COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Iphone 14 Price: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ రోజు బిగ్ దీపావళి సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌ నవంబర్‌ 11 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా అన్ని వస్తువులను SBI క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌ మల్టీ నేషనల్‌ బ్రాండ్‌కి సంబంధించి స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌గా లభించనున్నాయి. ముఖ్యంగా iPhone 14 స్మార్ట్‌ ఫోన్‌ ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఐఫోన్ 14ని అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
అతి తక్కువ ధరకే 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన iPhone 14 బేస్ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు.  బిగ్ దీపావళి సేల్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ  iPhone 14 బేస్ మోడల్ ధర రూ. 69,900గా ఉండగా..ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 21% తగ్గింపుతో రూ. 54,999కే ఫ్లిఫ్‌కార్ట్‌ విక్రయిస్తోంది. దీంతో పాటు మీరు మరింత తగ్గింపు ధరతో కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. మీరు ఈ బిగ్ దీపావళి సేల్‌ సేల్‌లో SBI క్రెడిట్‌ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.  దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 51,999కే పొందవచ్చు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్ 14పై కూడా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించడానికి  మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 42,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. అయితే ఈ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా అన్ని ఆఫర్స్‌ పోను మీరు ఐఫోన్ 14ను రూ.9,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్‌ను వినియోగించాలనుకునేవారు రూ.19,999 మాత్రమే చెల్లించి ఐఫోన్ 14ను పొందవచ్చు. 


iPhone 14 స్పెసిఫికేషన్‌లు:
6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
సిరామిక్ షీల్డ్‌ ప్రొటక్షన్‌
Apple A15 బయోనిక్ చిప్‌
 సినిమాటిక్ కెమెరా సపోర్ట్‌
మల్టీ-టాస్కింగ్ కోసం 6-కోర్ ప్రాసెసర్ 
12MP + 12MP డ్యూయల్ కెమెరా సిస్టమ్‌
12MP TrueDepthసెల్ఫీకెమెరా


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook