iPhone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో వినియోగదారులకు ఐఫోన్ మోడల్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్ 11 అయితే మీరెవరూ ఉహించని ధరకు లభ్యం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించింది. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ సేల్ సెప్టెంబర్ 30 వరకూ కొనసాగనుంది. వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ప్రత్యేకించి ఐఫోన్‌పై ఎక్కువ డిస్కౌంట్ అందుతోంది. ముఖ్యంగా ఐఫోన్ 11 అయితే మీరెవరూ ఊహించని ధరకే లభించవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..


ఐఫోన్ 11 బ్లాక్ కలర్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 35,990 రూపాయలకే లభించనుంది. అసలు ధర 43, 900 కాగా 18 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఐఫోన్ వినియోగించాలనే కోరిక ఉంటే ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లోగా కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేకపోతే 43 వేల 900 కు కొనాల్సి వస్తుంది. 


ఐఫోన్ 11 ఫీచర్లు


యాపిల్ ఐఫోన్ 11.. 6.1 ఇంచెస్ లిక్విడ్ రెటీనా ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్‌లో ఆక్టా కోర్ యాపిల్ ఏ13 బయోనిక్ ప్రోసెసర్ ఉంది. ఇందులో f/1.8 ఆపర్చర్‌తో పాటు 12 మెగాపిక్సెల్ మొదటి కెమేరా, f/2.4తో 12 మెగాపికెసల్ రెండవ కెమేరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎస్ఈ 2022 కంటే తక్కువకే పొందవచ్చు.


Also read: Gold Price Today: బంగారంపై పెట్టుబడికి మంచి సమయం, నవరాత్రిలోగా తగ్గనున్న ధరలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook