Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తోంది. ఇందులో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ పరికరాలపై ఊహించని భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్ ఉంది. పోకో ఇటీవల లాంచ్ చేసిన మోడల్ POCO F6 5Gని భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POCO F6 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాలతో ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు హెచ్‌డీఆర్ ప్లస్, డాల్బీ విజన్ సపోర్ట్ టెక్నాలజడీ ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చింది కంపెనీ. ఈ ఫోన్ పోకో లాంచ్ చేసిన లేటెస్ట్ వేరియంట్. ఇది ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఉంటుంది. ఈ ఫోన్‌పై ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మూడేళ్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ 4 ఏళ్లు ఇస్తోంది.  POCO F6 5G ఫోన్  5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం అరగంటలో 100 శాతం ఛార్జింగ్ అయిపోతుంది. 


కనెక్టివిటీ విషయానికొస్తే వైఫై 6, బ్లూటూత్ 5.4 లేటెస్ట్ వెర్షన్, యూఎస్‌బి సి పోర్ట్ ఛార్జింగ్, ఐఆర్ సెన్సార్, యాక్సెలెరో మీటర్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి అదనపు ఫీచర్లు. యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 64 రేటింగ్ ఉండటం విశేషం. ఇక సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 


POCO F6 5G ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ ఉంటుంది. అత్యధికకంగా 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఇక కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా సోనీ కంపెనీది ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 


POCO F6 5G ప్రారంభ ధర 29,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 6 వేల రూపాయలు ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంటే 23,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇక హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందుతుంది. 


Also read: SIP Tips: నెలకు 10 వేలతో 10 కోట్లు కూడబెట్టడం ఎలాగో తెలుసా, ఎన్నేళ్లు పడుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.