ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు మరో సేల్ బిగ్ సేవింగ్ డేస్ నడుస్తోంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 13 చాలా తక్కువకే లభిస్తోంది. భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. 6 రోజుల వరకూ నడిచే ఈ సేల్‌లో ఐఫోన్ 13పై అద్భుతమైన డిస్కౌంట్ ఉంది. కేవలం ఐఫోన్ ఒక్కటే కాదు..శాంసంగ్,  రియల్‌మి ఇతర బ్రాండెడ్ ఫోన్లపై కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 13 ధర 7000 రూపాయల డిస్కౌంట్ అనంతరం 62,999 రూపాయలకు లిస్ట్ అయింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా తీసుకుంటే మరో పది శాతం డిస్కౌంట్ ఉంది.  ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంకు కార్డు అయితే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ యాపిల్ ఐఫోన్ 13పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్ మార్చితే 17,500 రూపాయలు తగ్గుతాయి. అయితే ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుందనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, స్థితిపై ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఇందులో నో కాస్ట్ ఈఎంఐ 10,500 తో ప్రారంభమౌతుంది. 


ఐఫోన్ 13 ఫీచర్లు


ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 14 పవర్ ఇస్తుంది. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ స్క్రీన్ డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. ఈ డివైస్ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రొడక్ట్ రెడ్, గ్రీన్, బ్లూ, పింక్, స్టార్‌ లైట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. ఐఫోన్‌లో సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ కెమేరా, 12 మెగాపిక్సెల్ వైడ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ రేర్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్. ఐఫోన్ 13లో 5G,4G VoLTE,4G LTE, UMTS,GSM,Wi-Fi 6 సహా 2×2 MIMO బ్లూటూత్ 5.0 ఉన్నాయి. ఇందులో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువే. 


Also read: TVS iQube: ఈ చౌకైన స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్.. 1338% పెరిగిన అమ్మకాలు! యాక్టివా, జూపిటర్ మాత్రం కాదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook