Flipkart Offers On Mobiles 2023: ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర..ఒప్పో Reno 10, 10 Pro 5G స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్
Flipkart Offers On Mobiles 2023: ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల సందడి మొదలైంది. అయితే ఈ ఆఫర్స్‌లో ప్రముఖ టెక్ కంపెనీ ఒప్పో స్మార్ట్ ఫోన్స్ భారీ డిస్కౌంట్స్‌లో లభిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Flipkart Offers On Mobiles 2023: యువత Megapixel ఎక్కవగా ఉన్న స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టెక్ కంపెనీలు ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ప్రముఖ ఒప్పో కంపెనీ ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్‌లో తమ మొబైల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం Reno 10 5G, Oppo Reno 10 Pro 5G సిరీస్‌ల్లో లభిస్తోంది. ప్రో మోడల్‌కు సంబంధించిన విక్రయాలు జూలై 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే DSLRతో పోటీ పడబోతోందని ప్రముఖ టెక్ నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్టు(Flipkart)లో ఈ స్మార్ట్ ఫోన్ రూ.39,999 ఉండగా బ్యాంక్ ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. భారీగా డిస్కౌంట్ పొందాలనుకునేవారు మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి లాయల్టీ బోనస్‌లను పొందవచ్చు. ఈ మొబైల్ ఫోన్ ఎక్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.39,999 దాకా తగ్గింపు లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్స్:
HDFC, ICICI, SB బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఈఎమ్‌ఐ పద్ధతిలో కొనుగోలు చేస్తే 9 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా పొందవచ్చు. ఈ మొబైల్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ Oppo Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి MyOppoతో 6 నెలల వరకు Youtube Premium, Google Oneను ఉచితంగా పొందవచ్చు. ఇవే కాకుండా దుబాయ్ ట్రిప్‌తో పాటు ఒప్పో ప్యాడ్ ఎయిర్‌పై కూడా డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
Reno 10 Pro ఫీచర్లు:
✾ 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే
✾ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
✾ 50MP ట్రిపుల్ కెమెరా
✾ 32MP సెల్ఫీ కెమెరా
✾ 32MP టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా
✾ Qualcomm Snapdragon 778G ప్రాసెసర్
✾ 12GB ర్యామ్
✾ 4600mAh బ్యాటరీ
✾ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Reno 10 Pro+ ఫీచర్లు:
✾ 6.74-అంగుళాల AMOLED డిస్‌ప్లే
✾ హై-ఎండ్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్
✾ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్
✾ OIS సపోర్ట్
✾ 64MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా
✾ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్ సెట్
✾ గేమింగ్ కోసం MariSiliocn X NPU చిప్ సెట్
✾ 4700mAh బ్యాటరీ
✾ 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook