Flipkart offers: ఐఫోన్ 13పై భారీ ఆఫర్, ఇప్పుడీ ఫోన్ ధర కేవలం 42 వేలే

Flipkart offers: ఐఫోన్ 13 క్రేజ్..ఐఫోన్ 14 లాంచ్ తరువాత కూడా తగ్గడం లేదు. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్లే దీనికి కారణం. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్‌ఫై మరింత బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
ఐఫోన్ అంటేనే ఒక క్రేజ్. అందులో ఐఫోన్ 13 అంటే ఇంకా ఎక్కువనే చెప్పాలి. డిజైన్ కావచ్చు, ఫీచర్లు కావచ్చు..అన్ని విషయాల్లోనూ అద్భుతమైన ఫోన్ ఇది. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఇక ఐఫోన్ 13 కొనుగోలు చేయడం మీకు పెద్ద భారంగా ఉండదు.
ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌కు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 13 మిడ్‌నైట్ కలర్ 128 జీబీ స్టోరేజ్ ఫోన్ 62,999 రూపాయలకు లిస్ట్ అయింది. అసలు ధర 69,900 రూపాయలుగా ఉంది. అంటే 9 శాతం డిస్కౌంట్ అందుతోంది. ఈ ధర కూడా ఎక్కువే అనుకుంటే చింతించాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని ఆఫర్లు కలుపుకుంటే మరింత చౌకగా మారుతుంది.
ఐఫోన్ 13 పై 22,500 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. ఫలితంగా ఈ ఫోన్ మీకు కేవలం 42,499 రూపాయలకే లభిస్తుంది. నిజంగానే ఇదొక అద్భుతమైన డీల్. ఇంతకంటే తక్కువకు ఐఫోన్ 13 లభించడం కష్టం. ఒకవేళ ఐఫోన్ 13 కొనే ఆలోచన ఉంటే వెంటనే త్వరపడటం మంచిది. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఇది పరిమిత ఆఫర్. ఆఫర్ ముగిస్తే తిరిగి 62 వేలు చెల్లించి తీసుకోవల్సి వస్తుంది.
Also read: indfall Tax: చమురు కంపెనీలకు భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook