POCO X5 Pro 5G: షియోమీ నుంచి పోకో స్మార్ట్‌ఫోన్ గత కొద్దికాలంగా అందర్నీ ఆకర్షిస్తోంది. 20 వేల రేంజ్ లో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే పోకో మంచి ప్రత్యామ్నాయం. దీనికోసం POCO X5 Pro 5G అందుబాటులో ఉంది. ఎందుకంటే సూపర్ కెమేరా, పవర్ ఫుల్ బ్యాటరీ, తక్కువ ధర ప్రత్యేకం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POCO X5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన కెమేరా, శక్తివంతమైన బ్యాటరీ సొంతం. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్‌పై భాడీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వినియోగించుకుంటే అతి తక్కువ ధరకే ఈ ఫోన్ లభిస్తుంది. POCO X5 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్‌తో వస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ధరలు 20,999 రూపాయలు, 24,999 రూపాయలుగా ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇవి కూడా వర్తిస్తే మీక్కావల్సిన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువకు లభించవచ్చు.


హెచ్‌‌డీఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐలో కొనుగోలు చేస్తే 1000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. నెలకు కేవలం 879 రూపాయల సులభమైన వాయిదాకు పొందవచ్చు. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. పోకో ఎక్స్ 5 ప్రో 6 జీబీ వేరియంట్‌పై 20,250 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మొత్తం అన్ని ఆఫర్లు కలుపుకుంటే 20 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 749 రూపాయలకే లభిస్తుంది. 


POCO X5 Pro 5G ఫీచర్లు


పోకో ఎక్స్ 5 ప్రో స్మార్ట్ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 778 జి ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వరకూ ఉంటుంది. ఇందులో ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరో ప్రత్యేకత. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరో అద్భుతమైన ఫీచర్ కానుంది. ఇందులో అన్నింటికంటే ముఖ్యం కెమేరా. ట్రిపుల్ రేర్ కెమేరా సెటప్ ఉంది. ముఖ్యంగా 108 మెగాపిక్సెల్ , 8 మెగా పిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కోసం ఏకంగా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది.


Also read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook