యాపిల్ కంపెనీ ఐఫోన్ అంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. యాపిల్ ప్రేమికుల్ని కట్టి పడేసే ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అద్భుత ఫీచర్లు కలిగిన ఐఫోన్ 11ను అత్యంత కారుచౌక ధరకే ఇస్తోంది. ఆ వివరాలు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ ఐఫోన్ కొనాలని అందరికీ ఉంటుంది. కానీ ధర చూసి వెనుకంజ వేస్తుంటారు. అదే ఐఫోన్ అత్యంత తక్కువ ధరకు లభిస్తే..ఎగిరి గంతేస్తారు కదూ. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఊహించని ధరకు మీకిష్టమైన ఐఫోన్ 11 లభ్యమౌతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్న ఈ డిస్కౌంట్‌తో ఐఫోన్ 11 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీ ఐఫోన్ కోరిక నెరవేర్చుకోవాలంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకంటే తక్కువ ధరకు ఐఫోన్ 11 లభించడమనేది అసాధ్యం.


ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11..64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ మోడల్ ధర 43, 990 రూపాయలు కాగా డిస్కౌంట్ అనంతరం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 35,990 రూపాయలకే లభిస్తోంది. ఇది కాకుండా దీనిపై 16,900 రూపాయలు ఎక్స్చేంజ్ ధర ఉంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ప్రయోజనం పూర్తిగా వర్తిస్తే మరో 16,900 రూపాయలు తగ్గుతాయి. అంటే ఐఫోన్ 11 మీకు కేవలం 19 వేలకే లభిస్తుంది. 


ఐఫోన్ 11 అనేది 64 జీబీ స్టోరేజ్ మోడల్. ఇందులో 6.1 ఇంచెస్ లిక్విడ్ రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఇందులో 12 ప్లస్ 12 మెగాపిక్సెల్ రేర్ కెమేరాతో పాటు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. ఇది ఏ13 బయోనిక్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 


Also read: 7th Pay Commission: భారీగా పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, ఐదేళ్ల ఎరియర్లు కూడా, దీపావళి కానుక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook