COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme 11 5G 8GB+128GB Mobile Dead Cheap Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌తో పాటు ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌ మీ శుభవార్త  తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌ అందిస్తున్న రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ల చెందిన మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని Realme వెబ్‌సైట్‌ కూడా రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మీ బ్రాండ్‌లకు సంబంధించిన అన్ని మొబైల్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. 


ఈ సేల్‌లో భాగంగా Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ.18,999 కాగా రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా కేవలం రూ.16,999తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ రూ.16,999కు అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి రియల్‌ మీ ప్రత్యేక తగ్గింపును కూడా అందిస్తోంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో 8GB ర్యామ్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు రియల్‌మీ కూడా రూ.2,000 వరకు ఫ్లాట్‌ తగ్గింపును అందిస్తుంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ పొందడానికి HDFC, SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను కూడా వినియోగించవచ్చు. ఇలా చేస్తే దాదాపు రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.12,999కే పొందవచ్చు. 


Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Android 13 ఆధారిత Realme UI 4.0
6.72-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే
1,080x2,400 పిక్సెల్స్‌
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter