Gmail Feature: మెయిల్ ఒకరికి బదులు మరొకరికి పంపిస్తే డిలీట్ ఆప్షన్ ఉందా, ఎలా చేసుకోవచ్చు
Gmail Feature: ఆన్లైన్ మొబైల్ వినిమయం పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ చాలా సులభమైపోయింది. క్షణాల్లో సమాచారాన్ని చేరవేయగలుగుతున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో పొరపాటున ఒకరికి బదులు మరొకరికి లేదా ఒకదానికి మరొకటి పంపించేస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.
Gmail Feature: వాట్సప్‌లో ఏదైనా రాంగ్ మెస్సేజ్ పంపిస్తే 7 నిమిషాల్లోగా ఆల్ డిలీట్ చేసే అవకాశముంది. కానీ మెయిల్ విషయంలో ఆ పరిస్థితి లేదు. పొరపాటున ఒకరికి బదులు మరొకరికి మెయిల్ వెళితే సరిదిద్దుకునే అవకాశం మెయిల్‌లో కూడా ఉందని చాలామందికి తెలియదు. అదెలాగో తెలుసుకుందాం..
సాధారణంగా మెయిల్స్ పంపించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాం. తప్పులతో మెయిల్ పంపించడం లేదా ఒకరికి కాకుండా మరొకరికి పంపించడం జరుగుతుంటుంది. ఎడిట్ ఆప్షన్ లేదా డిలీట్ ఆప్షన్ లేకపోవడంతో చాలా ఇబ్బందికర పరిణామం. తప్పుడు మెయిల్ వెనక్కి తీసుకునే అవకాశముంటే బాగుంటుందనే అబిప్రాయం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఆందోళన చెందాల్సి అవసరం లేదు. జీ మెయిల్ అలాంటి ఫీచర్ అందిస్తోంది. ఇదే అన్ డూ ఫీచర్. ఈ ఫీచర్ సహాయంతో తప్పుడు మెయిల్‌ను కొన్ని సెకన్షనలో క్యాన్సిల్ చేసి వెనక్కి డ్రాఫ్ట్స్‌లోకి రప్పించవచ్చు. అయితే దీనికి కొద్ది సెకన్ల వ్యవధే ఉంటుంది. అంతకంటే ముందు జీమెయిల్‌లో డీఫాల్ట్‌గా ఉన్న అన్ డూ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో పరిశీలిద్దాం
ముందుగా జీమెయిల్ ఎక్కౌంట్‌లో సైన్ ఇన్ కావాలి. ఇప్పుడు స్క్రీన్ ఎగువభాగంలో కుడివైపున ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేస్తే సీ ఆల్ సెట్టింగ్స్ కన్పిస్తుంది. అది క్లిక్ చేస్తే కొత్త స్క్రీన్ ఓపెన్ అయి జనరల్ సెట్టింగ్స్ కన్పిస్తాయి. ఇందులో అన్ డూ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌లో 5 నుంచి 30 సెకన్ల వరకూ టైమ్ ఎంచుకోవల్సి ఉంటుంది, అంటే మెయిల్ పంపించిన ఎంత సేపట్లో డిలీట్ ఆప్షన్ ఉండాలనుకుంటన్నారో ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇది గరిష్టంగా 30 సెకన్లే ఉంటుంది. కనిష్టంగా 5 సెకన్ల నుంచి మొదలౌతుంది. తరువాత సెట్టింగ్స్ మెనూ కింద వరకూ వస్తే సేవ్ చేంజెస్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసి ఏదైనా మెయిల్ టైప్ చేసి సెండ్ చేయాలి. స్క్రీన్ కింద మెస్సేజ్ సెంట్ అనే పాప్ అప్ కన్పిస్తుంది. దానిపక్కనే అన్ డు బటన్ ఉంటుంది. మెయిల్ రద్దు చేయాలంటే 30 సెకన్లలోపు దానిపై క్లిక్ చేయాలి. అంతే మీ మెయిల్ తిరిగి మీ డ్రాఫ్ట్స్‌కు వచ్చేస్తుంది. ఎడిట్ చేసుకుని పంపించవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు.
Also read: Janasena-Telugudesam: కొలిక్కివచ్చిన తెలుగుదేశం-జనసేన సీట్లు సర్దుబాటు, జనసేన స్థానాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook